Breaking News

Dallas Bathukamma : డాలస్‌లో సందడి చేసిన టీపాడ్‌ చిన్నబతుకమ్మ

Published on Thu, 10/19/2023 - 06:32

తెలంగాణ సంస్కృతిని అమెరికా గడ్డపై వికసింపజేస్తున్న తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన్ ఆఫ్‌ డాలస్‌ (TPAD).. ఈ ఏడాది మరింత ఉత్సాహంతో బతుకమ్మ వేడుకలకు శ్రీకారం చుట్టింది. దాదాపు వేయి మంది మహిళలు అందంగా తీర్చిదిద్దిన తమ బతుకమ్మలతో కుటుంబసభ్యులను వెంటబెట్టుకుని వచ్చి డాలస్‌లోని ఆండ్రివ్‌ బ్రోన్ పార్క్‌ ఈస్ట్‌లో సందడి చేశారు. మహిళలందరూ బృందవలయాలుగా ఏర్పడి పాటలు పాడుతూ బతుకమ్మను కొలుస్తూ పులకించిపోయారు. తెలంగాణ నేల నుంచి పూల పండుగే తరలివచ్చిందన్న చందంగా వేడుక సాగింది.  

పండుగ నిర్వహణకు ప్రత్యేక కమిటీలు
చిన్నబతుకమ్మ పండుగను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఫౌండేషన్ కమిటీ చైర్‌ రఘువీర్‌ బండారు, బీవోటీ చైర్‌ సుధాకర్‌ కలసాని, ప్రెసిడెంట్‌ లింగారెడ్డి అల్వ, కోఆర్డినేటర్‌ రోజా ఆడెపు నేతృత్వం వహించారు. టీపాడ్‌ పూర్వ అధ్యక్షులు రమణ లష్కర్‌, ఉపాధ్యక్షులు అనురాధ మేకల, కార్యదర్శి రత్న ఉప్పల సూచనలు సలహాలు అందించారు. చిన్నబతుకమ్మ పండుగకు చైర్‌గా గాయత్రి గిరి, కో-చైర్‌గా అనుషా వనం, అడ్వయిజర్‌గా ఇంద్రాణి పంచెర్పుల తమ సేవలందించారు. హరిశంకర్‌రెడ్డి రేసు, ప్రశాంత్ నిమ్మని.. హాజరైన ప్రతి ఒక్కరికి పులిహోర, దద్దోజనం, మిఠాయిలు వడ్డించి తాము పుట్టిపెరిగిన ప్రాంతపు మధురజ్ఞాపకాలను గుర్తుకొచ్చేలా చేయడమే కాకుండా అందరి మన్ననలు అందుకున్నారు. ఆడియో, సౌండ్‌ సిస్టమ్‌ బాధ్యతలు స్వీకరించిన బాల గణపవరపు, నరేశ లింగంపల్లి.. మూడు గంటల పాటు బతుకమ్మ పాటలతో హుషారు నింపి హోరెత్తించారు. బతుకమ్మల నిమజ్జనం కోసం శ్రావణ్‌ నిడిగంటి, సుచేంద్రబాబు ప్రత్యేకంగా టబ్‌లు ఏర్పాటు చేయడం, నీటి సదుపాయం కల్పించడం వంటి పనులు చూసుకున్నారు. రవాణా వ్యవహారాలను సంతోష్‌ రేగొండ, భోజన సదుపాయాలను సంతోష్‌, సోషల్‌ మీడియా వ్యవహారాలను మధుమతి వైశ్యరాజు, ఆదిత్య గాదె చూసుకున్నారు. రిసెప్షన్ బాధ్యతలు మాధవి మెంట, దీపికారెడ్డి చూసుకోగా, శశిరెడ్డి, మాధవి ఓంకార్‌ డెకరేషన్ దగ్గరుండి చేయించారు.  

అక్టోబర్‌ 21న సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలకు ఏర్పాటు
అక్టోబర్‌ 15 ఆదివారం రోజున చిన్న బతుకమ్మ పండుగతో బతుకమ్మ-దసరా వేడుకలకు అంకురార్పణ చేసిన టీపాడ్‌.. అక్టోబర్‌ 21న మెగా వేడుకలకు సన్నద్ధమవుతున్నది. ఏటా పదివేల మందితో సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆకర్షించిన టీపాడ్‌.. ఈ దఫా మరింత వైభవంగా ఆర్గనైజ్‌ చేస్తున్నది. ఈ వేడుకలకు డాలస్‌లోని కొమెరికా సెంటర్‌ (పెప్పర్‌ ఎరెనా) వేదికగా నిలుస్తున్నది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలు అర్ధరాత్రి వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. 

విశేష అతిథిగా సంయుక్తామీనన్, రాఫెల్‌ ప్రైజ్‌గా బీఎండబ్ల్యూ బైక్‌
సినీ కథానాయిక సంయుక్తామీనన్ విశేష అతిథిగా హాజరవనున్న ఈ పండుగలో సుప్రసిద్ధ గాయకులు తమ గాత్రంతో వీనులవిందు చేయనున్నారు. వేడుకల్లో భాగంగా రాఫెల్‌ ప్రైజ్‌లను అందజేయనున్నారు. వీటిలో  బీఎండబ్ల్యు బైక్‌, బంగారు నాణేలు, పట్టు చీరలు, డ్రెస్‌ మెటీరియల్‌, ఆర్టిఫిషియల్‌ జువెల్లరీతో పాటు గిఫ్ట్‌ ఓచర్లు ఉన్నాయి. బీఎండబ్ల్యు బైక్‌ మరియు రాఫెల్‌ ప్రైజ్‌లను మాధవి లోకిరెడ్డి, హారిక పాల్వాయి అనౌన్స్ చేశారు. వేడుకల వివరాల కోసం టీపాడ్‌ వెబ్‌సైట్‌ టీపాడ్‌యూఎస్‌.ఓఆర్‌జీను బ్రౌజ్‌ చేయొచ్చు.

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)