Breaking News

చికాగోలో అభిమానులతో కలిసి కేక్ కట్ చేసిన అరి మూవీ టీం

Published on Sun, 10/12/2025 - 13:37

అరిషడ్వర్గాలు అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మూవీ అరి.  అరిషడ్వర్గాలులోని మొదటి రెండు పదాలైన అరి అనే టైటిల్‌‌తో వచ్చిన ఈ సినిమాకు మై నేమ్ ఈజ్ నోబడీ అనేది క్యాప్షన్. ఈ మూవీ అక్టోబర్ 10 న  ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ని సంపాదించుకుంది.  ఎవరూ టచ్ చేయని ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌ తో  దర్శకుడు జయశంకర్ ఈ మూవీని తెరకెక్కించారు.  

అర్ వీ రెడ్డి సమర్పణలో శ్రీనివాస్‌ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి ఈ మూవీని నిర్మించారు. వినోద్‌ వర్మ, సూర్య, అనసూయ,సాయికుమార్, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. ఇటీవల వచ్చిన సినిమాల్లో  అరి కాస్త ముందు వరుసలో ఉందని చెప్పుకోవచ్చు.

ఇక ఈ  మూవీ రిలీజ్ సందర్భంగా చికాగోలోని  సినీ లాంజ్ లో మూవీ టీం సందడి చేసింది. మూవీ ప్రొడ్యూసర్ ఆర్ వీ రెడ్డి తో పాటు  చికాగోలోని పలువురు ప్రముఖులు పాల్గొని కేక్‌ కట్ చేశారు. అనంతరం టీం మెంబర్స్‌ అంతా శుభాకాంక్షలు తెలియజేశారు.  ఇక ‘అరి’ సక్సెస్ సాధించడంతో పలువురు  అభినందనలు తెలిపారు. దర్శకుడు ఏడేళ్ల శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కిందని కొనియాడారు.  

మనిషిలోని అంతర్గత శత్రువులను ఎలా ఎదుర్కోవాలో చెప్పే ప్రయత్నంగా  అరి మూవీని తెరకెక్కించారని  వివరించారు. ఇంత గొప్ప సినిమాను తెరకెక్కించిన మూవీ టీమ్ ను పలువురు ప్రశంసించారు. అరికి మంచి ప్రశంసలు లభించడం, ఆదరణ దక్కుతుండటంతో  మూవీ టీంలో కొత్త ఉత్తేజం వచ్చినట్టుగా కనిపిస్తోంది.

(చదవండి: Karwa Chauth: భార్య కోసం బ్రిటిష్ వ్యక్తి కర్వా చౌత్ ఉపవాసం..! పాపం చంద్రుడి దర్శనం కోసం..)

#

Tags : 1

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి