Breaking News

యూఏఈ లాటరీలో జాక్‌పాట్‌.. చరిత్ర సృష్టించిన అనిల్‌ బొల్లా

Published on Tue, 10/28/2025 - 13:38

పండుగపూట లక్ష్మీదేవి ఆ భారతీయ యువకుడ్ని మాములుగా కనికరించలేదు. రాత్రికి రాత్రే అతగాడిని కోటీశ్వరుడిని చేసేసింది. తల్లి సెంటిమెంట్‌తో రూ.1,200 పెట్టి లాటరీ టికెట్‌ కొంటే.. 88 లక్షల మంది పాల్గొన్న లాటరీలో ఏకంగా రూ.240 కోట్ల డబ్బు గెల్చుకుని చరిత్ర సృష్టించాడు. 

భారత్‌కు చెందిన అనిల్‌కుమార్‌ బొల్లా(అతని స్వస్థలంపై స్పష్టత రావాల్సి ఉంది).. ఏడాదిన్నర కిందట యూఏఈకి వెళ్లాడు.  అయితే.. 2025 అక్టోబర్ 18న యూఏఈ నగరం అబుదాబిలో జరిగిన లక్కడీ డే డ్రాలో రూ.240 కోట్ల (Dh100 మిలియన్) బంపర్‌ లాటరీ గెలుచుకున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను యూఏఈ లాటరీ నిర్వాహకులు సోమవారం అధికారికంగా విడుదల చేశారు. 

తన పూర్తి పేరు అనిల్‌కుమార్‌ బొల్లా మాధవరావు బొల్లా అని, రాత్రికి రాత్రే తన జీవితం మారిపోయిందని ఆ యువకుడు చెప్పడం ఆ వీడియోలో ఉంది. లాటరీ నెగ్గానని తెలియగానే సోఫాలో కుప్పకూలిపోయానని.. సంతోషంతో మాటలు రాలేదని, లోపల మాత్రం యస్‌.. నేను గెలిచా అనే ఆంనందం అలా ఉండిపోయిందని వివరించాడు.

ఈ లాటరీ కోసం ఒక్కో టికెట్‌కు 50దిర్హామ్‌(రూ.1200) పెట్టి 12 టికెట్లు కొన్నాడు అనిల్‌. అయితే అందులో అదృష్టం తెచ్చి పెట్టి టికెట్‌ నెంబర్‌ 11. ఆ నెంబర్‌కు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?. తన తల్లి పుట్టినరోజు అంట. అందుకే ఆ నెంబర్‌ను ఎంపిక చేసుకుని.. తన తల్లి ఆశీర్వాదంతోనే అదృష్టం కలిసొచ్చిందని.. అంతకు మించి తాను ఏదీ చేయలేదని నవ్వుతూ చెబుతున్నాడు అనిల్‌. పైగా దీపావళి సమయంలోనే ఇలా జరగడాన్ని సంతోషంగా భావిస్తున్నట్లు తెలిపాడు.

మరి ఇంత డబ్బుతో ఏం చేస్తావు? అని ప్రశ్నిస్తే..  తనకు కొన్ని కలలు ఉన్నాయని అని నెరవేర్చకుంటానని, అలాగే.. ఓ సూపర్‌కార్‌ కొనుగోలు చేసి.. సెవెన్‌స్టార్‌​ హోటల్‌లో కొన్నాళ్లపాటు జాలీగా గుడుపుతానని నవ్వుతూ చెప్పాడు. అంతకంటే ముందు.. తన తల్లిదండ్రులకు చిన్నచిన్న కోరికలను తీరుస్తానని, తన కుటుంబాన్ని యూఏఈకి తీసుకొచ్చి ఇక్కడే గడుపుతానని, వచ్చిందాంట్లో కొంత చారిటీలకు ఇస్తానని తెలిపాడు.

Videos

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)