Breaking News

తానా ఆధ్వర్యంలో అమెరికాలో రహదారుల దత్తత

Published on Wed, 10/16/2024 - 16:18

అమెరికా, పెన్సిల్వేనియా రాష్ట్ర రాజధాని హ్యారిస్ బర్గ్ నగరంలో మిడ్ అట్లాంటిక్ తానా విభాగం వారు సామాజిక భాద్యత పై అవగాహన కల్పిస్తూ "అడాప్ట్ ఏ హైవే" కార్యక్రమం నిర్వహించారు. కమ్యూనిటీ సర్వీస్ లో భాగంగా, అత్యంత రద్దీ గల రహదారిని తానా ఆధ్వర్యంలో దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మిడ్-అట్లాంటిక్  తానా బృందం రహదారి పరిసరాలు పరిశుభ్రం చేయడమే కాకుండా పచ్చదనాన్ని పరిరక్షించడం కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు. హ్యారిస్ బర్గ్ తానా టీం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దలు, పలువురు విద్యార్థులు చురుకుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అమెరికా సమాజంతో మమేకమై సమాజ సేవ చేయాలనే సంకల్పం కలిగించడానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఈ కార్యక్రమం చేపట్టిందని  మిడ్ అట్లాంటిక్ తానా రీజినల్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు తెలిపారు.  ఇంత చక్కటి కార్యక్రమం చేపట్టి విజయవంతం చేసిన హ్యారిస్ బర్గ్ తానా బృందానికి తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి ధన్యవాదాలు తెలిపారు.

ఈ స్వచ్చంద కార్యక్రమంలో పాల్గొన్న పలువురు విద్యార్థులు సమాజానికి ఎంతో మేలు చేసే ఈ కార్యక్రమం ప్రకృతి పట్ల చక్కటి అవగాహన కలిగించి, ప్రకృతిని, పచ్చదనాన్ని ఎలా సంరక్షించుకోవాలో నేర్చుకున్నామని తెలిపారు. తానా ఆధ్వర్యంలో విద్యార్థులలో సేవా భావం పెంపొందించేలా సమాజానికి మేలు చేసే ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న పలువురు ఆకాంక్షించారు.
 

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)