Breaking News

8వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు ఘనంగా

Published on Thu, 07/10/2025 - 11:12

టంపా: ఫ్లోరిడా:  అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి జరిగే  నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గణపతి పూజలో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య అమెరికా తెలుగు సంబరాలను బాలకృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. తెలుగు సంస్కృతిని,  సంప్రదాయాలను పరిరక్షిస్తూ తెలుగుదనం ఉట్టిపడేలా అమెరికా తెలుగు సంబరాలను నిర్వహిస్తున్నందుకు నాట్స్ సంబరాల కమిటీని  ఆయన అభినందించారు.  అమెరికాలో తెలుగు వారి కోసం నాట్స్ చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. తెలుగు భాష పరిరక్షణలో నాట్స్ చేస్తున్న కృషిని కొనియాడారు. ఇప్పటివరకు మూడు సార్లు నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో పాలు పంచుకున్నానన్నారు.

హంసవింశతి పుస్తకం ఆవిష్కరణ
18వ శతాబ్ధంలో ప్రముఖ తెలుగు కవి అయ్యలరాజు నారాయణ రచించిన హంసవింశతి కావ్యాన్ని తనికెళ్ల భరణి నేటి తరం కోసం ఓ పుస్తక రూపంలో తీసుకొచ్చారు. సంబరాల వేదికపై నందమూరి బాలకృష్ణ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలుగు భాష మాధుర్యాన్ని ఎందరో కవులు తమ రచనల్లో ప్రతిబింబించారని బాలకృష్ణ అన్నారు. భావితరాలకు తెలుగు మాధుర్యాన్ని అందించేందుకు  నేటి తరం వారు తెలుగులో మాట్లాడాలని, తెలుగు రచనలను పిల్లలకు పరిచయం చేయాలన్నారు.

పద్యం, అవధానం తెలుగు భాషకే సొంతమైన అమూల్యమైన ఆభరణాలని ప్రముఖ రచయిత, నటులు తనికెళ్ల భరణి అన్నారు.. తెలుగు భాషా మాధుర్యాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని భరణి పేర్కొన్నారు. తెలుగులో ఎన్‌సైక్లోపీడియా లాంటి పుస్తకం హంసవింశతి అని తెలిపారు.. దీనిని ప్రతి తెలుగువాడు చదవితే మన చరిత్రలో మనకు తెలియని సరికొత్త విషయాలు తెలుస్తాయని భరణి అన్నారు. 8వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి, ఏపీటీఎస్ చైర్మన్ మోహనకృష్ణ మన్నవతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి!

#

Tags : 1

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)