Breaking News

18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్: అదిరిపోయిన ఆరంభం!

Published on Mon, 06/10/2024 - 12:38

ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ జూన్ 7న బ్యాంకెట్‌తో మొదలయ్యి..మూడు రోజులు వివిధ కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా జరిగాయి. జార్జియా వరల్డ్‌ కాంగ్రె సెంటర్‌ ప్రాంగణం ఈ వేడుకుల కోసం అంత్యంత సుందరంగా ముస్తాబయ్యింది. అట్లాంటాలో ఈ వేడుకలు 2000, 2012లో జరగగా మళ్లీ ఇన్నేళ్లకు జరగడం విశేషం. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభించిన అనంతరం కన్వెన్షన్ కోర్ టీం కన్వీనర్ కిరణ్ పాశం, అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాన్ని ఇంతలా దిగ్విజయంగా చేసుకునేందుకు సహకరించిన స్పాన్సర్లను కోర్ కమిటీ తోపాటు ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆలా, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ తిరుపతి ఎర్రంరెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, బోర్డు అఫ్ ట్రస్టీలు ఘనంగా సత్కరించారు. 

 

ఇక ఆటా అవార్డ్స్ కమిటీ వివిధ రంగాలలో ప్రతిభాపాటవాలు చూపించిన వారికి అవార్డులు ప్రదానం చేసింది. ఈ వేడుకలో జరిగిన పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలంగాణ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు దుద్దిళ్ల, సినీ నటులు శ్రీకాంత్, మెహ్రీన్, నేహా షెట్టి, తమ్మారెడ్డి భరద్వాజ, సందీప్ రెడ్డి వంగా వంటి పలువురు విశిష్ట అతిథులు ఆటా వారి ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలియ జేసి, అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనూప్ రూబెన్స్ బృందం చేసిన మ్యూజికల్ కాన్సర్ట్ చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ఉర్రూతలూగించింది. రుచికరమైన భోజనాలు అందరి జిహ్వ చాపల్యాన్ని తీర్చాయి. 

ఇక ఈ వేడుకలో యూత్ కాన్ఫరెన్స్ హైటెట్‌గా నిలిచింది. ఎక్కడెక్కడ నుంచే పెద్ద ఎత్తున​ యువతీయువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ ఆటా నవత, యువత, భవితకు ఆటా పెద్ద పీట వేస్తుందంటూ దీని ప్రాముఖ్యత గురించి వివరించారు ప్రెసిడెంట్ మధు బొమ్మినేని ఇంకా ఎన్నో ఆకట్టుకునే అలాగే అట్లాంటా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుండి పలు నాన్ ప్రాఫిట్ సంస్థల నుంచి ఎంతో మంది వచ్చారు. వారందరికీ కన్వీనర్ కిరణ్ పాశం అభినందనలు తెలిపి, ఈ కన్వెన్షన్ ఎలా మొదలయ్యిందీ, ఎంత మంది పాటుపడ్డారు, వాలంటీర్ల కృషి మున్నగు వివరాలు గురించి వివరించారు. ఆటా టీం గౌరవ అతిథులకు కృతజ్ఞతలు తెలియజేసి, సముచితంగా సత్కరించారు. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేసుకుని అందరం కలిసి పాల్గొని  ఆనందిద్దాం అని అన్నారు కన్వీనర్ కిరణ్ పాశం.

(చదవండి: 18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ సర్వం సన్నద్ధం!)

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)