Breaking News

జ్యోతి మల్హోత్రా డైరీలో సంచలన వివరాలు

Published on Wed, 05/21/2025 - 08:17

న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra) కేసులో మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. తన పాకిస్తాన్ పర్యటనలను వివరించే పలు వీడియోలను జ్యోతి మల్హోత్రా సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్‌ చేసిన దరిమిలా ఆమె వార్తల్లో నిలిచారు. 33 ఏళ్ల ఈ యూట్యూబర్‌ను పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేశారనే ఆరోపణలతో అరెస్టు చేశారు.

ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటెలిజెన్స్ బ్యూరో(Intelligence Bureau)లు జ్యోతి మల్హోత్రా కేసును దర్యాప్తు చేస్తున్నాయి. తాజాగా ఆమె డైరీలోని రెండు పేజీలు సంచలన వివరాలను వెల్లడిస్తున్నాయి. వీటిలో ఆమె పాకిస్తాన్‌లో 10 రోజుల పాటు ఎలా గడిపారనే వివరాలున్నాయని సమచారం. ఈ డైరీని హర్యానా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో ‘ఈ రోజు, నేను పాకిస్తాన్‌లో 10 రోజుల పర్యటన  ముగించుకుని, నా దేశమైన భారతదేశానికి తిరిగి వచ్చాను. ఈ పర్యటనలో నాకు పాకిస్తాన్ ప్రజల నుండి  ఎంతో ప్రేమ లభించింది. మా శ్రేయోభిలాషులు మమ్మల్ని కలవడానికి వచ్చారు. మేము లాహోర్‌ను సందర్శించడానికి రెండు రోజులు సరిపోలేదు’ అని తేదీ లేని ఆ పేజీలో జ్యోతి మల్హొత్రా రాసినట్లు ఉంది.

పాకిస్తాన్‌ను రంగులమయంగా అభివర్ణించిన ఆమె అక్కడి తన అనుభవాలను మాటల్లో వర్ణించలేమని పేర్కొంది. డైరీలోని ఎంట్రీలలో ఆమె పాకిస్తాన్ అధికారులకు చేసిన ఒక అభ్యర్థన వివరాలు ఉన్నాయి. ‘పాక్‌లోని దేవాలయాలను కాపాడండి. 1947లో వారు విడిపోయిన  కుటుంబాలను భారతీయులతో కలవనివ్వండి’ అని ఆమె పేర్కొంది. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రాను మే 16న అరెస్టు చేసిన అధికారులు.. ఆమెపై అధికారిక రహస్యాల చట్టం, భారతీయ న్యాయ సంహితలోని వివిధ విభాగాల కింద  కేసులు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి: ‘స్వర్ణదేవాలయంలో వైమానిక రక్షణ తుపాకులు మోహరించలేదు’

Videos

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)