Breaking News

రాత్రికి రాత్రే సోషల్‌ మీడియా స్టార్‌.. ఉదయం లేవగానే భారీ షాక్‌

Published on Sun, 08/02/2026 - 19:15

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఒక మురికివాడలో నివసించే మహ్మద్ ఇర్ఫాన్ అనే యువకుడు రాత్రికి రాత్రే సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయిపోయారు. అయితే, అంతలోనే ఆయన ఖాతాను యూట్యూబ్‌ తొలగిచింది. దీనిపై యూట్యూబ్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. అయితే ఇర్ఫాన్ పేజీ ‘మెయిన్ ఇర్ఫాన్’ను తెరవడానికి ప్రయత్నిస్తే.. “గూగుల్ సేవా నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఈ ఖాతాను తొలగించాం” అనే సందేశం కనిపిస్తోంది.

ఇర్ఫాన్ కూడా ఎక్స్‌లో స్పందించారు. ఖాతా తొలగింపు “ఏదో పొరపాటు” వల్ల జరిగి ఉంటుందని చెబుతూ, దానిని సరిచేయాలని యూట్యూబ్‌ను కోరారు. “నా ఛానల్ పూర్తిగా కొత్తది. యూట్యూబ్ మార్గదర్శకాలను నేను నిజాయితీగా పాటించాను” అని ఇర్ఫాన్ పేర్కొన్నారు. “ప్రజలు నా కంటెంట్‌ను ఎంతో ఇష్టపడ్డారు. అందుకే సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరిగింది. మీ ఆటోమేటిక్ వ్యవస్థ వల్ల పొరపాటు జరిగి ఉండొచ్చు. దయచేసి నా ఛానల్‌ను మరోసారి పరిశీలించి పునరుద్ధరించండి” అని అన్నారు.

ఇర్ఫాన్ ఛానల్‌కు సీనియర్ జర్నలిస్టు అజిత్ అంజుమ్ బహిరంగంగా మద్దతు తెలిపారు. ఛానల్ యాక్టివ్‌గా ఉన్న సమయంలో, అది తొలగించిన తర్వాత కూడా ఆయన ఎక్స్‌లో పలుసార్లు పోస్టులు చేశారు.

“ఢిల్లీలోని ఒక మురికివాడలో నివసించే మహ్మద్ ఇర్ఫాన్ అనే యువకుడు మా సహకారంతో నిన్ననే తన యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు” అని అజిత్ అంజుమ్ ఆదివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. “నిన్న సాయంత్రం నుంచి ఈ ఉదయం వరకూ అతని ఛానల్‌కు 70,000 మందికి పైగా సబ్‌స్క్రైబర్లు వచ్చారు. ఈ ఉదయం అకస్మాత్తుగా అతని యూట్యూబ్ ఛానల్‌ను తొలగించారు. ఆ యువకుడు ఇంత తక్కువ సమయంలో ఇంతమంది సభ్యులను ఎలా సంపాదించాడు? అదే ఒక అసాధారణ విజయం. మరి యూట్యూబ్ అతని ఛానల్‌ను ఇంత హఠాత్తుగా ఎందుకు తొలగించింది?” అని ప్రశ్నించారు.

ఇంకా పలువురు సోషల్ మీడియా యూజర్లు కూడా ఇర్ఫాన్ పేజీకి మద్దతుగా పోస్టులు చేశారు. ఆ కంటెంట్, ఛానల్ నిజమైనవేనని, గూగుల్‌కు చెందిన యూట్యూబ్ ఆటోమేటెడ్ వ్యవస్థల పొరపాటు వల్లే ఖాతా తొలగింపు జరిగిందని పేర్కొన్నారు. ఈ సమస్యను సరిచేయాలని యూట్యూబ్‌ను కోరారు.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)