Breaking News

రన్నింగ్‌ ట్రైన్‌ ఎక్కబో​యి.. ప్లాట్‌ఫాం మధ్యలో పడిన యువతి

Published on Wed, 11/06/2024 - 19:02

తిరువనంతపురం: కదులుతున్న రైలును ఎక్కే ప్రయత్నం చేసిన యువతి.. అదుపుతప్పి ప్లాట్‌ఫాం, రైలు మధ్యలో పడిపోయారు. ఈ ప్రమాదం కేరళలోని కన్నూర్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఆదివారం జరిగిన ఈ ప్రమదంలో 19 ఏళ్ల యువతికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. పుదుచ్చేరి-మంగళూరు వీక్లీ రైలులో ఇరిట్టికి చెందిన యువతి.. తలస్సేరి నుంచి మంగళూరుకు వెళుతోంది. అయితే.. మధ్యలో కన్నూర్‌ రైల్వే స్టేషన్‌లో రైలు కాసేపు ఆగటంతో.. సదరు యువతి స్టేషన్‌లో ఉన్న షాప్‌లో స్నాక్స్ కొనుగోలు చేయడానికి దిగారు. 

కొనుగోలు చేస్తున్న సమయంలోనే రైలు కదటం గమనించిన యువతి.. పరుగెత్తుకుంటూ వెళ్లి రైలు ఎక్కే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె ఒక్కసారిగా రైలు, ప్లాట్‌ఫారం మధ్య పడిపోయారు. ప్రయాణికులు, రైల్వే పోలీసులు, క్యాటరింగ్ సిబ్బంది అప్రమత్తం కావడంతో వెంటనే డ్రైవర్‌కు సమాచారం అందించడంతో ఆమెను రక్షించేందుకు రైలును నిలిపివేశారు. ఆ యువతికి స్వల్ప గాయాలకు అవ్వటంతో.. చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం రైల్వే అధికారులు.. ఆమె మరోక రైలులో ఎక్కించి మంగళూరుకు పంపించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

 

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు