Breaking News

మేమే దేశాన్ని నడిపించాలనుకుంటున్నారా?

Published on Sat, 03/14/2026 - 08:03

న్యూఢిల్లీ: ‘యావత్‌ దేశాన్ని మేమే నడపాలని మీరు కోరుకుంటున్నారా?’అంటూ సుప్రీంకోర్టు ఓ పిటిషనర్‌ను ప్రశ్నించింది. రహదారులు, వంతెనలు, విద్యుత్‌ వైరింగ్‌ తదితరాలు సక్రమంగా ఉండేలా ప్రజల భద్రతకు తగు చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా వర్తించే సమగ్ర ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఈమేరకు వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌ మాల్యా బాగి్చల ధర్మాసనం శుక్రవారం ఇందుకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. షాపింగ్‌ మాల్‌లో అన్ని రకాల వస్తువులు, సేవలు అందుబాటులో ఉన్నట్లే అన్ని అంశాలకు ఒకే చోట పరిష్కా రం కోరుతున్న ఈ పిటిషన్‌ చాలా బాగుందని పేర్కొంది. ‘సమస్యలను నిర్దిష్టంగా ప్రస్తావించలేప్పుడు. 

ఆచరణ సాధ్యం కాని ఆదేశాలను జారీ చేయలేం. అందుకే ఈ రిట్‌ పిటిషన్‌పై విచారణకు నిరాకరిస్తున్నాం. పిటిషనర్‌ కావాలనుకుంటే సరైన రీతిలో పిటిషన్‌ను రూపొందించి, సంబంధిత పరిధిలోని హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం కలి్పస్తున్నాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌లోని సానుకూల అంశాలపై తామెలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదని పేర్కొంది. ‘పిటిషన్‌ కోరిన విధంగా చేసేందుకు ఆర్థిక వనరులు అవసరమవుతాయి. సంబంధిత రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, బడ్జెట్‌ను అర్థం చేసుకోవడానికి ఆయా రాష్ట్రాల హైకోర్టులే సరైనవి’అని ధర్మాసనం అభిప్రాయపడింది. 

అధికారుల నిర్లక్ష్యం వల్ల నిత్యం దేశ వ్యాప్తంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని పిటిషనర్‌ తరఫు లాయర్‌ తెలిపారు. అయితే, యావత్తు దేశాన్ని మేమే పాలించాలని భావిస్తున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘షోరూం, షాపింగ్‌ మాల్‌ మాదిరిగానే మీ పిటిషన్‌ కూడా చాలా బాగుంది. రోడ్లపై గుంతలు, రహదారులు, అసంపూర్తి వంతెనలు తదితర నిర్మాణాలు..ఇలా ప్రతి ఒక్కటీ ఇందులో ఉంది. భూమిపై ఉన్న ప్రతి ఒక్క సమస్యకూ మీరు పరిష్కారం చూపారు’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

పిటిషన్‌లో ఇంకా ఏముంది? 
రోడ్లు, వంతెనలు, విద్యుత్‌ వైరింగ్‌ వంటి బహిరంగ మౌలిక సదుపాయాల నిర్వహణ, సాధారణ తనిఖీలు, క్రమబద్ధమైన ఆడిటింగ్‌ నిర్వహించడం ద్వారా ప్రజా భద్రతను నిర్ధారించాలని కోరింది. నగర, శివారు ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు, ప్రజల భద్రతను పర్యవేక్షించడానికి ఒక ఉన్నత స్థాయి స్వతంత్ర భద్రతా ఆడిట్‌ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలో సివిల్‌ ఇంజనీర్లు, మౌలిక సదుపాయాల నిపుణులు, పౌర సమాజం, మానవ హక్కుల సంస్థల ప్రతినిధులు ఉండాలి. 2020 నుంచి మౌలిక సదుపాయాల లోపాల వల్ల జరిగిన మరణాల డేటాను సేకరించి, డిజిటలైజ్‌ చేసి బహిరంగ పరచాలి. మూడు నెలలకోసారి జిల్లాల వారీ నివేదికలను సుప్రీంకోర్టుకు సమరి్పంచేలా ఆదేశాలు ఇవ్వాలి.

 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు