కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?
Breaking News
10 రోజుల్లో సీఎం యోగి రాజీనామా చేయకుంటే..
Published on Sun, 11/03/2024 - 10:15
ముంబై: ఇటీవలి కాలంలో పలువురు ప్రముఖులకు చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావడం పరిపాటిగా మారింది. తాజాగా మహారాష్ట్రలోని ముంబై పోలీసులకు ఒక బెదిరింపు సందేశం వచ్చింది. దానిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ నిందితులు బెదిరించారు.
ఈ మెసేజ్ అందుకున్న మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తం కావడంతో పాటు ఈ మెసేజ్ పంపిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ముంబైలోని ట్రాఫిక్ కంట్రోల్ సెల్‌కు ఒక నంబర్ నుండి యోగి ఆదిత్యనాథ్ 10 రోజుల్లో రాజీనామా చేయకపోతే, బాబా సిద్ధిఖీ మాదిరిగా చంపేస్తాం' అని రాసి ఉంది. ఈ సందేశం శనివారం (నవంబర్ 2) సాయంత్రం అందింది. ఈ నేపధ్యంలో భద్రతా వ్యవస్థ అప్రమత్తమయ్యింది. ముంబై పోలీసులు నిందింతుణ్ణి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: లక్నోలో ఎన్‌కౌంటర్.. ఒక దుండగునికి గాయాలు
Tags : 1