Breaking News

ఆర్‌ఎస్‌ఎస్‌ చేతికి యూపీ ఉపఎన్నికల బాధ్యత

Published on Wed, 10/23/2024 - 11:19

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన సన్నాహాల్లో ఎస్పీ, బీజేపీలు బిజీగా ఉన్నాయి. ఎస్పీ ఇప్పటివరకు ఏడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా, బీజేపీ కూడా అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిందని, ఒకట్రెండు రోజుల్లో జాబితాను విడుదల చేసే అవకాశం ఉందనే వార్తలు వినవస్తున్నాయి. యూపీలో ఉప ఎన్నికల బాధ్యతను ఆర్‌ఎస్‌ఎస్‌కు బీజేపీ అప్పగించింది.

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ సమావేశంలో పాల్గొనేందుకు మధురకు చేరుకున్నారు. ఆయన 10 రోజుల పాటు మధుర పర్యటనలో ఉండనున్నారు. తాజాగా సంఘ్ చీఫ్‌తో సీఎం యోగి భేటీ అయ్యారు. ఉప ఎన్నికల్లో ఓటింగ్‌శాతాన్ని పెంచడం, బూత్ నిర్వహణ, ఎన్నికల వ్యూహం  తదితర అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది.

సంఘ్ వ్యూహంతోనే హర్యానా ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని పార్టీ భావిస్తోంది. ఇప్పుడు జార్ఖండ్, మహారాష్ట్రతో పాటు యూపీలో బీజేపీ గెలుపునకు వ్యూహం రచించే పనిలో సంఘ్ బిజీగా ఉంది. యూపీలో హిందూ ఓటర్లను ఏకం చేయడం, ఓబీసీ, దళిత ఓటర్లను బీజేపీవైపు ఆకర్షించడం తదితర అంశాలపై సంఘ్ దృష్టి సారిస్తోంది. ఇందుకోసం సంఘ్‌ కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి, ఇంటింటికీ ప్రచారం నిర్వహించనున్నారు. బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడంపై కూడా సంఘ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: బెజవాడలో వ్యక్తి దారుణ హత్య 
 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)