యోగా గురు రామ్‌దేవ్‌ బాబా సంచలన వ్యాఖ్యలు : దుమారం

Published on Mon, 07/13/2026 - 16:09

యోగా గురు రామ్‌దేవ్ బాబా హిందూ రాష్ట్రం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.  మన పూర్వీకులు ఒక్కరేనని, దేశంలో ముస్లింలకు లేదా క్రైస్తవులకు ఎలాంటి ప్రమాదం లేదని, అందువల్ల 'హిందూ రాష్ట్రం' అనే భావన పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. రామ్‌దేవ్ బాబా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.

ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి ద్వారా  సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న 60 ఏళ్ల ఈ యోగా గురువు,   2009లో  ఉత్తరప్రదేశ్‌లోని తాను మదర్సాను సందర్శించిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ రామ్‌దేవ్ ఇలా అన్నారు: "హరిద్వార్ సమీపంలో డియోబంద్ ఉంది. మన మతాలు వేరుగా ఉండవచ్చు, కానీ మన పూర్వీకులు ఒక్కరే. 'హిందూ రాష్ట్రం' అనే భావన పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మనందరి పూర్వీకులు సనాతన హిందూ ఆర్య-వైదికులే. ఈ విషయం మన కళ్ల ముందే స్పష్టంగా ఉంది’’ అంటూ పెద్ద దుమారాన్నే రాజేశారు. 

హిందుస్థాన్‌లోముస్లింలకు గానీ, క్రైస్తవులకు గానీ ఎలాంటి ప్రమాదం లేదని ఆయన అన్నారు. అంతేకాదు ముస్లింలు తమ ఇష్టప్రకారం గడ్డం ఉంచుకోవచ్చు, లేదా తీసేసుకోవచ్చన్నారు. అంతేకాదు, నచ్చిన దుస్తులు ధరించవచ్చని, కానీ తమ పూర్వీకుల లాంటి మంచిప్రవర్తనను, సాంప్రదాయాలను అలవర్చు కోవాలని ఆయన సలహా ఇచ్చారు.

మండిపడ్డ  విపక్షాలు 
రామ్‌దేవ్ బాబా వ్యాఖ్యలపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ రామ్‌దేవ్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు. అందరూ సనాతనులే అయితే, సమాజంలో ఇన్ని విభజనలు సృష్టించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అందరినీ సమానంగా అంగీకరించ కుండా విడదీయడం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తించారు.

దేశం కేవలం రాజ్యాంగం ప్రకారమే నడుస్తుందని, భారతదేశాన్ని 'హిందూ రాష్ట్రం' అని ఎవరు ప్రకటించారని AIMIM వారిస్ పఠాన్  ప్రశ్నించారు. ముస్లింలు ఎవరికీ భయపడరని, రాజ్యాంగానికి లోబడే జీవిస్తారని చెబుతూ, ఇలాంటి ద్వేషపూరిత వ్యాఖ్యలను మానుకోవాలని  హితవు పలికారు.

ఇదీ చదవండి:అయోధ్య ట్రస్ట్‌ సీఈవో పదవికి దరఖాస్తులు ఆహ్వానం, అర్హతలేంటో!

దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి సమస్యలనుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి బీజేపీ వ్యూహాత్మకంగా ఇలాంటి వారిని తెరపైకి తెచ్చి 'హిందూ రాష్ట్రం' గురించి మాట్లాడిస్తోందని సమాజ్‌వాదీ పార్టీ నేత ఫఖ్రుల్ హసన్ చాంద్ ఆరోపించారు. అన్ని మతాలను  సమానంగా గౌరవించే లౌకిక దేశమనదని ఎన్‌సీపీ నేత నసీమ్ సిద్దిఖీ గుర్తుచేశారు. ప్రజలు తమకు నచ్చిన మతాన్ని, ఆచారాలను అనుసరించే స్వేచ్ఛ ఉందని, ఇలాంటి వ్యాఖ్యలు దేశ సమగ్రతకు, సోదరభావానికి ముప్పు కలిగిస్తాయని ఆయన ఖండించారు.

ఇదీ చదవండి : 82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)