Breaking News

భార్యతో జస్ట్‌ 90 సెకన్లు : వ్యాపారవేత్త ఆదిత్య ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Thu, 07/30/2026 - 12:53

ఆధునిక జీవితంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తే తప్ప ఒక సాధారణ కుటుంబం సౌకర్యవంతంగా జీవించలేని పరిస్థితి. అందులో ఎంతో శ్రమ, ఓర్పు, సహనం దాగి ఉంటుంది. అలాంటిది ఒక స్టార్టప్‌ను విజయవంతంగా నడపాలంటే ఇద్దరూ వ్యక్తిగత జీవితంలో చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది.  అలా ఇద్దరు భాగస్వాములు ఒక స్టార్టప్‌ను నిర్మించడంలో పూర్తిగా నిమగ్నమై నప్పుడు జీవితం ఎలా ఉంటుందో వివరిస్తూ ఒక స్టార్టప్‌ ఫౌండర్‌ తన భార్యతో గడిపే క్షణాల గురించి  సోషల్‌ మీడియాలో చెప్పుకొచ్చారు. జస్ట్‌ కొన్ని సెకన్ల పాటు విమానాశ్రయంలో తన భార్యను కలిసిన చిత్రాన్ని పంచుకుంటూ లింక్డ్‌ఇన్ (LinkedIn) పోస్ట్‌ ద్వారా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతపై కొత్త చర్చను రేకెత్తించారు.

ఢిల్లీకి చెందిన, అట్-హోమ్బ్యూటీ, వెల్‌నెస్ ప్లాట్‌ఫామ్ (YesMadam) సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ ఆదిత్య ఆర్య, (భార్య గరిమా శర్మ) తన పోస్ట్‌ ద్వారా వ్యక్తిగత జీవిత విశేషాలను షేర్‌ చేశారు. కలిసి గడపడానికి చాలా తక్కువ సమయం ఉన్నప్పటికీ, ఆ కొన్ని క్షణాలను అర్థవంతంగా మార్చుకోవడానికి ప్రయత్నించామంటూ చెప్పుకొచ్చారు. 

ఇదీ చదవండి: కంగనా రనౌత్‌లా మారిన సాయోని ఘోష్ : ఏకిపారేస్తున్న నెటిజన్లు

బహుశా ఎవరూ వివాహాన్ని ఇలా ప్లాన్ చేసుకోరు. మాలో ఒకరం ల్యాండ్ అవుతున్నాం మరొకరం బయలు దేరుతున్నాం," అని ఆదిత్య ఆర్య తెలిపారు.  అయినా, తామిద్దరం ఒకే గేట్ వద్ద 90 సెకన్ల పాటు చేతులు పట్టుకుని, ప్రపంచంలో ఉన్న సమయమంతా మాకే ఉన్నంత గొప్పగా ఫీలయ్యామని  తెలిపారు. కేవలం  ఈ ఒకటిన్నర భేటీలో  తీసుకున్న ఒక పిక్‌ను షేర్‌ చేశారు. అంతేకాదు విమానాశ్రయంలో తన భార్యను ఇలా అనుకోకుండా కలవడం ఇది మొదటిసారి కాదని ఆయన పేర్కొన్నారు. నిజానికి, చాలా జంటలు డేట్‌లకు వెళ్తుంటే, తాము మాత్రం "లేఓవర్లు" (విమాన ప్రయాణాల్లో మధ్యలో ఆగడం) చేస్తుంటామని చెప్పారు.

ఇది సంస్థ నేర్పిన పాఠం 
నిజానికి ఎవరూ తన దాంప్యత జీవితాన్ని ఇలా ప్లాన్ చేసుకోరు. కానీ కలిసి ఒక వ్యాపారాన్ని లేదా సంస్థను నిర్మిస్తున్నప్పుడు మీ జీవితం ఆటోమేటిక్‌గా ఈ రూపాన్ని సంతరించుకుంటుంది. తక్కువ సమయాన్ని కూడా గరిష్టంగా ఎలా ఉపయోగించుకోవాలో ‘యస్ మేడమ్’ మాకు నేర్పింది. ఫౌండర్లుగా ఉన్నవారి వివాహ బంధానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని తొమ్మిదేళ్ల వైవాహిక జీవితంపై ఆదిత్య వెల్లడించారు.

గరిమా శర్మ స్పందన
ఆదిత్య ఆర్య భార్య  కంపెనీ గరిమా శర్మ  డైరెక్టర్‌గా  ఉన్నారు. ఆమె తన భర్త పోస్ట్‌పై స్పందిస్తూ, ఇతరులకు విచిత్రంగా అనిపించేది తమకు లభించే రొమాన్స్ అని పేర్కొన్నారు. ఒక కంపెనీని నిర్మించడం, ఉపాధిని సృష్టించడం, తామిద్దరం నమ్మే ఆశయం కోసం జీవించడం... మాటలతో మాత్రమే కాకుండా అవకాశాలను సృష్టించడం ద్వారా దేశానికి సేవ చేయవచ్చని తమ పిల్లలకు చూపించడమే తమ లక్ష్యమని ఆమె చెప్పారు. కొందరు ఎయిర్‌పోర్ట్‌లో పక్క పక్కనుంచి వెళుతున్న సాధారణ ప్రయాణీకులా తమని చూడొచ్చు. కానీ తాము మాత్రం ఒకేడ్రీమ్‌ వైపు అడుగులు వేస్తున్న ఇద్దరిని చూశాం అంటూ  గర్వంగా చెప్పుకొచ్చారు. 

ఇదీ చదవండి: చెఫ్ అవుదామనుకుని స్టార్‌ హీరో : కళ్లు చెదిరే కార్లు, ఆస్తులు

Videos

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

ఆసియా గేమ్స్ మహిళల కబడ్డీలో భారత్ కు స్వర్ణం

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

Photos

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)