Breaking News

Year Ender 2024: ఈ ఆసనాలను వేసి.. బరువు తగ్గామంటూ సంతోషం

Published on Thu, 12/05/2024 - 17:06

2024 ముగియడానికి ఇక కొద్దిరోజుల మాత్రమే మిగిలివుంది. జనమంతా న్యూ ఇయర్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో కొందరు 2024లో తమకు ఎదురైన తీపి జ్ఞాపకాలను, చేదు అనుభవాలను గుర్తుచేసుకుంటున్నారు. 2024లో చాలామంది బరువు తగ్గేందుకు యోగాసనాలను ఆశ్రయించారు. కొన్ని ఆసనాలను వారు అమితంగా ఇష్టపడ్డారు.

మలాసనం
2024లో చాలామంది మలాసనం కోసం శోధించారు. దీనిని అభ్యసించి ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకున్నారు. ఈ యోగాసనాన్ని స్క్వాట్ అని కూడా అంటారు. క్రమం తప్పకుండా ఈ  ఆసనం వేస్తే శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవచ్చని యోగా నిపుణులు అంటున్నారు. ఈ ఆసనం వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు మొదలైన వాటి నుండి ఉపశమనం  అందిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఉదర కండరాలను బలోపేతం చేస్తుంది.

పవనముక్తాసనం
పవనముక్తాసనం  2024లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ యోగాసనం అసిడిటీ, మలబద్ధకం తదితర సమస్యల నుంచి విముక్తి కల్పిస్తుంది. అంతే కాదు ఈ యోగాసనాన్ని రెగ్యులర్‌గా చేస్తే చాలా త్వరగా పొట్ట తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.  కీళ్లనొప్పుల నుంచి కూడా ఈ ఆసనం ఉపశమనం కల్పిస్తుంది.

తాడాసనం
2024 సంవత్సరంలో చాలామంది అత్యధికంగా శోధించిన యోగాసనాలలో తాడాసనం కూడా చోటు దక్కించుకుంది. ఈ యోగాసనం సహాయంతో  శరీరంలోని పలు అవయవాలకు శక్తి సమకూరుతుంది. ఈ ఆసనం శరీరపు ఎత్తును పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

మత్స్యాసనం
చాలమంది ఈ ఏడాది మత్స్యసనం కోసం సెర్చ్‌ చేశారు. ఈ యోగాసనం శారీరక, మానసిక అభివృద్ధికి చాలా మంచిదని నిపుణులు చెబుతుంటారు. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా చేస్తుంటే మెడ, భుజాలకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది పొట్టను కరిగించడంలో సహాయపడుతుంది.

పశ్చిమోత్తనాసనం
పశ్చిమోత్తనాసం యోగాభ్యాసంలో ముఖ్యమైనదిగా చెబుతుంటారు. 2024లో చాలామంది ఈ ఆసనాన్ని వేసి లబ్ధి పొందారు. ఈ యోగాసనం జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది వెన్నెముక  సమస్యలను పరిష్కరిస్తుంది. పొట్ట కొవ్వును తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ యోగాసనాన్ని క్రమం తప్పకుండా వేస్తే, నిద్రలేమి  సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Year Ender 2024: భారత్‌ను వణికించిన వ్యాధులు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)