Breaking News

యమునా ఉగ్ర రూపం.. వరద గుప్పిట్లో సీఎం కేజ్రీవాల్‌ నివాసం

Published on Thu, 07/13/2023 - 11:44

ఢిల్లీలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు లేకపోయినా యమునా నది ఉప్పొగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో ఢిల్లీకి వరద ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే హర్యానాలోని హత్నికుండా బ్యారేజీ నుంచి నీటిని విడుదల కొనసాగుతుండటంతో యమున నది గరిష్ట నీటి మట్టంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. 45 ఏళ్ల రికార్డును తుడిచిపెడుతూ 208.66 మీటర్ల గరిష్ట నీటి మట్టంతో ప్రవహిస్తోంది. ప్రమాదకర స్థాయి కంటే మూడు మీటర్లు ఎగువన ప్రవహిస్తోంది. అయితే  గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి తగ్గుముఖం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
చదవండి: Video: ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన వరద బాధితురాలు

వరద గుప్పిట్లో కేజ్రీవాల్‌ నివాసం
యమునా నది మహోగ్ర రూపంతో సెంట్రల్‌ ఢిల్లీ ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. సీఎం కేజ్రీవాల్‌ నివాసం, ఢిల్లీ అసెంబ్లీని వరద నీరు చుట్టుముట్టింది. సివిల్ లైన్స్ ప్రాంతంలోని రింగ్ రోడ్ వరదలు చేరాయి. దీంతో మజ్ను కా తిలాను కశ్మీరీ గేట్ ఐఎ‌స్బీటీతో కలిపే మార్గంపై రాకపోకలు నిలిపివేశారు అధికారులు.

ఇళ్లు జలమయం, పాఠశాలలకు సెలవులు
యమునా నది ప్రళయంతో స్థానిక  ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో స్థానిక ప్రజలను ఖాళీ చేశారు. వారిని సహాయక శిబిరాలకు తరలించారు. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించారు. వరదల ప్రభావంతో మరో రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నది ఒడ్డున ఉన్న ప్రాంతాలు యమునా బజార్, ప్రసిద్ధ టిబెటన్ మొనాస్టరీ మార్కెట్, నిగంబోధ్ ఘాట్‌లో  దహన సంస్కారాలను నిలిపివేశారు.  
చదవండి: Delhi Floods: దేశ రాజధానికి ఈ దుస్థితి దేనికి?

వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల మూసివేత
'యమునా నది నీటిమట్టం పెరగడంతో వజీరాబాద్, చంద్రవాల్, ఓఖ్లాలోని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను మూసివేస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. దీని వల్ల ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తలెత్తుతుంది. నది నీటిమట్టం తగ్గిన వెంంటనే ఈ ప్లాంట్‌లను మళ్లీ రీస్టార్ట్ చేయడానికి  ప్రయత్నిస్తామని తెలిపారు.  అదే విధంగా ఈ క్రమంలో హత్నికుండా  బ్యారేజ్ నుంచి నీటి విడుదల నిలిపివేయాలని కేంద్రాన్ని అరవింద్ కేజ్రీవాల్ కోరారు. అయితే పూర్తిస్థాయి నీటి మట్టం దాటేయడంతో, అదనపు నీటిని విడుదల చేస్తున్నట్టు కేంద్రం పేర్కొంది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి