Breaking News

తప్పు స్పెల్లింగ్‌తో నకిలీ కిడ్నాప్‌ గుట్టు రట్టు

Published on Wed, 01/08/2025 - 16:07

లక్నో: ఓ ఫేక్‌ కిడ్నాప్‌ కేసును ఉత్తరప్రదేశ్‌ పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఒక ఇంగ్లీష్‌ పదానికి రాంగ్‌ స్పెల్లింగ్ రాసిన క్లూతో కేసు అసలు గుట్టును రట్టు చేశారు. ఈ నకిలీ కిడ్నాప్‌ ఘటన యూపీలోని హర్దోయి జిల్లాలో జరిగింది. జిల్లాకు చెందిన సందీప్‌ (27) తాను కిడ్నాప్‌ అయినట్లు నాటకమాడి,రూ.50వేలు ఇవ్వాలని తన సోదరుడిని డిమాండ్‌ చేస్తూ వేరే ఫోన్‌ నుంచి మెసేజ్‌ పెట్టాడు.

సోదరుడికి పంపిన బెదిరింపు మెసేజ్‌లో డబ్బులు ఇవ్వకుంటే సందీప్‌ను చంపేస్తామని రాసిన చోట డెత్‌ అనే పదాన్ని తప్పుగా(deathబదులుdeth)అని రాశాడు. ఈ మెసేజ్‌ నిశితంగా పరిశీలించిన పోలీసులు దానిని‌ పంపిన వ్యక్తి అంతగా చదువుకోని వ్యక్తి అని నిర్ణయానికి వచ్చారు. పైగా సందీప్‌కు శత్రువులు ఎవరూ లేకపోవడంతో అనుమానం బలపడింది. ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా సందీప్‌ ఆచూకీ గుర్తించారు.

కిడ్నాప్‌ విషయమై సందీప్‌ను విచారించారు. విచారణ సందర్భంగా ఆ బెదిరింపు మెసేజ్‌ను రాయమని సందీప్‌ను కోరారు. దీంతో సందీప్‌ మరోసారి ‘డెత్‌’ అనే పదాన్ని తప్పుగా రాయడంతో కిడ్నాప్‌ నాటకమాడింది అతడేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. డబ్బుల కోసం తానే ఈ నాటకం ఆడానని, ఓ పాపులర్‌ క్రైమ్‌ సీరియల్‌ చూసి ఈ పని చేశానని పోలీసులకు చెప్పాడు.  

ఇదీ చదవండి: పెళ్లికి సాయం చేస్తానని పిలిచి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)