Breaking News

దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలివే!

Published on Sat, 06/03/2023 - 11:59

ఒడిశా బాలాసోర్‌ ఘోర రైలు ప్రమాద ఘటన.. భారీ విషాదాన్ని నింపేదిగా కనిపిస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. సుమారు 900 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలామంది పరిస్థితి విషమంగానే ఉండడం.. ఇంకా బోగీల్లో వాళ్లను బయటకు తీసే చర్యలు కొనసాగుతుండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చు.  ఒకేసారి మూడు రైళ్లు ఢీ కొట్టడంతో.. అతిపెద్ద ప్రమాదంగా భావిస్తున్నారు పలువురు. కానీ, స్వాతంత్ర భారత దేశ చరిత్రలో ఇంతకన్నా ఘోరమైన ప్రమాదాలు చాలానే చోటుచేసుకున్నాయి. 


👉 దేశ చరిత్రలోనే అతి పెద్ద రైలు ప్రమాదం జూన్ 6, 1981న బీహార్‌లో జరిగింది. తుపాను సమయంలో రైలు బాగ్‌మతి నది బ్రిడ్జ్‌ దాగుతుండగా బోగీలు నదిలో పడిపోయాయి. రెండు రోజుల తర్వాత.. 200 దాకా మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు.  ఐదు రోజుల తర్వాత 235 మంది మరణించారని, ముగ్గురి జాడ తెలియరాలేదని రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. కానీ, వందల మంది తమ వాళ్ల జాడ లేదంటూ మీడియా ముందుకు వచ్చారు. నది ఉధృతికి వాళ్లంతా కొట్టుకుపోయి ఉండొచ్చనే భావించారంతా. ఈ ఘటనలో సుమారు ఏడు నుంచి 800 మంది మరణించి ఉండొచ్చని అంచనా. 

1988లో దక్షిణ భారత్లోని క్విలోన్ వద్ద ఓ సరస్సులో రైలు భోగీలు పడిపోయాయి. ఈ ఘటనలో 106 మంది చనిపోయారు.

👉 ఆగస్ట్ 20, 1995న ఫిరోజాబాద్ సమీపంలో పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ ఆగి ఉన్న కాళింది ఎక్స్‌ప్రెస్‌ని ఢీకొట్టింది. ఆఘటనలో దాదాపు 358 మంది దాక ప్రాణాలు కోల్పోయారు. దీన్ని భారతీయ రైల్వేస్‌.. రెండవ అత్యంత ఘోరమైన రైలు ప్రమాదంగా పరిగణించింది.  ఫిరోజాబాద్‌ వద్ద కాళింది రైలు నీల్‌గై(ఒకరకం జంతువు)ను ఢీ కొట్టింది. ఆపై అది బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ముందుకు సాగలేదు. ఈలోపు సిగ్నలింగ్‌వ్యవస్థలో లోపంతో మరో రైలు అదే పట్టాలపై దూసుకొచ్చింది. కాళింది ఎక్స్‌ప్రెస్‌ను బలంగా ఢీ కొట్టడంతో.. 358 మంది నిద్రలోనే మరణించారు. కానీ, ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 400 దాకా ఉండొచ్చనేది అంచనా.  

నవంబర్ 26, 1998న జమ్ము తావి-సీల్దా ఎక్స్‌ప్రెస్ ప్రమాదం. పంజాబ్‌లోని ఖన్నాలో పట్టాలు తప్పిన ఫ్రాంటియర్ గోల్డెన్ టెంపుల్ మెయిల్‌ని జమ్ము తావి సీల్దా ఎక్స్ప్రెస్‌ ఢీ కొట్టడంతో సుమారు 212 మంది మరణించారు.

👉 ఆగస్ట్ 2, 1999న నార్త్ ఫ్రాంటియర్ రైల్వేకతిహార్ డివిజన్‌లోని గైసల్ స్టేషన్‌లో మరో రైలు ప్రమాదం జరిగింది. బహ్మపుత్ర మెయిల్‌, అవధ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎదురెదురుగా వచ్చి ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 285 మందికి పైగా మరణించగా 300 మందికి పైగా గాయప్డడారు. కానీ బాధితుల్లో చాలామంది ఆర్మీ, బీఎస్‌ఎస్‌ లేదా సీఆర్పీఎఫ్‌ సిబ్బందే ఉండటం బాధకరం.

👉 సెప్టెంబరు 9, 2002న హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ రఫీగంజ్‌లోని ధావే నది వంతెనపై నుంచి పట్టాలు తప్పడంతో 140 మందికి పైగా మరణించారు. ఈ ఘటనకు ఉగ్రవాద విధ్వంసమే కారణమని ఆరోపణలు వచ్చాయి.

👉 డిసెంబర్ 23, 1964న రామేశ్వరం తుఫాను కారణంగా పాంబన్-ధనుస్కోడి ప్యాసింజర్ రైలు కొట్టుకుపోయింది. అందులో ఉన్న 126 మంది ప్రయాణికులు మరణించారు.

👉 మే 28, 2010న జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ముంబైకి వెళ్లే ఆ రైలు ఝర్‌గ్రామ్ సమీపంలో పట్టాలు తప్పింది, ఆపై ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలుని ఢీకొట్టింది. ఈ ఘటనలో 148 మంది ప్రయాణికులు మరణించారు.

👉 నవంబర్ 20, 2016న కాన్పూర్‌కు సుమారు 60 కి.మీ దూరంలో పుఖ్రాయాన్ వద్ద ఇండోర్‌ రాజేంద్ర ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో సుమారు 14 కోచ్‌లు ధ్వంసమయ్యాయి. దీంతో ఈ ఘటనలో 152 మంది ‍ప్రాణాలు కోల్పోగా, 260 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

(చదవండి: నిమిషాల వ్యవధిలోనే.. మూడు రైళ్లు..)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)