Breaking News

నా రోజు – నా హక్కు

Published on Thu, 11/20/2025 - 12:39

World Childrens Day 2025 సర్‌ విలియం బ్లాక్‌స్టోన్‌ ప్రకారం తల్లితండ్రులకు పిల్లల పట్ల మూడు ప్రధాన బాధ్య తలు ఉంటాయి. పిల్లల పెంపకం, రక్షించడం, వారికి విద్యను అందించడం. ఐక్యరాజ్య సమితి ‘మానవ హక్కుల ప్రకటన’లో 25(2)వ నిబంధన రక్షణ, సహాయం పొందడం అనేది పిల్లల హక్కుగా పేర్కొంది. పిల్లలకు సాధారణంగా మనం పొందే హక్కులతో పాటు ప్రత్యేకంగా బాలల హక్కులుంటాయి. బాలలకు ప్రధానంగా జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగ స్వామ్య హక్కులుంటాయి. వీటిలో భాగంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండే హక్కు, తల్లితండ్రుల సంరక్షణలో ఉండే హక్కు, పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకొనే హక్కు, లైంగిక వేధింపుల నుండి విముక్తి పొందే హక్కు;

వినోదం–విశ్రాంతి పొందే హక్కు, ఉచిత విద్యతో పాటు ఆడుకొనే హక్కు, భావవ్యక్తీకరణతో పాటు గౌరవాన్ని పొందే హక్కులుంటాయి. వీటితో పాటు స్వేచ్ఛగా ఆలోచించే హక్కు కూడా పిల్లలకుంది.  పాలస్తీనా, ఇజ్రాయెల్‌ల అంతర్గత ఘర్షణ వల్ల పలువురు బాలలు పసిప్రాయంలోనే ప్రాణాలు కోల్పోతుండగా, ఆఫ్రికా ఖండంలో సోమాలియా, నైజీరియా వంటి దేశాలలో పిల్లలకు పౌష్టికాహారం లభించక ఆకలి మరణాలు సంభవిస్తున్నాయి. మన దేశంలో ఎక్కువగా బాల్య వివాహ బాధితులున్నారు. దేశంలో ఏటేటా బాల కార్మికులు, వీధిబాలలు, వివక్షకు గురి అయినవారు, ఎయిడ్స్‌ తదితర బాధిత బాలలు పెరుగుతున్నారు. పాకిస్తాన్‌ వంటి దేశాల్లో మత సంబంధమైన కారణాలతో ఆడపిల్లల్ని చదువుకు దూరం చేస్తున్నారు.

చదవండి : H-1B వీసాలు ట్రంప్‌ దెబ్బ : టాప్‌లో ఆ కంపెనీల జోరు

 పిల్లలను పనిచేసే వారిగా, డబ్బు సంపాదించే వనరుగా చూడరాదు. ఈ ఏడాది ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం థీమ్‌ ‘నా రోజు, నా హక్కులు’. ఈ థీమ్‌ పిల్లల జీవితం, వారి హక్కులు ఎలా ఉన్నాయి, ఎలా మెరుగుపరచవచ్చనే దానిపై పిల్లల నుండి నేరుగా వినడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది పిల్లలకు వారి అభిప్రాయాలను తెలియజేయడానికీ, వారి భవి ష్యత్తుపై తమ అభిప్రాయాలను పంచుకోవడానికీ అవకాశాన్నిస్తుంది.

– ఎం. రాంప్రదీప్‌  జన విజ్ఞాన వేదిక
(నేడు ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం)

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)