Breaking News

‘అది ఎప్పటికీ జరగదు’.. పాకిస్థాన్‌కు ఫరూక్‌ అబ్దుల్లా వార్నింగ్‌!

Published on Fri, 10/25/2024 - 16:47

న్యూఢిల్లీ: జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌దాడులకు పాకిస్థాన్‌లోనే మూలాలు ఉన్నాయని నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, నిరంతర దాడులు చేయడం ఆపాలని పాకిస్థాన్‌ను హెచ్చరించారు. ఇరుదేశాలు స్నేహితులుగా క‌లిసి ఉండేందుకు ఇస్లామాబాద్‌ మార్గాన్ని వెతకాల‌ని, లేదంటే ప‌రిస్థితులు ప్ర‌మాద‌క‌రంగా మారుతాయ‌ని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు.

అయతే జమ్ముకశ్మీర్‌లో ఇటీవల ఉగ్రదాడులు ఎక్కువైన సంగతి తెలిసిందే. గురువారం కూడా బారాముల్లాలో ఆర్మీ వాహ‌నంపై జ‌రిగిన దాడిలో ఇద్ద‌రు సైనికులు, ఇద్ద‌రు పౌరులు మృతిచెందారు. అంత‌కు మూడు రోజుల ముందు ఆరుగురు నిర్మాణ కార్మికులు, ఓ డాక్ట‌ర్‌ను ఉగ్రవాదులను కాల్చి చంపారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ.. దాడుల‌కు ప‌రిష్కారం క‌నుగొనే వ‌ర‌కు ఇవి కొనసాగుతూనే ఉంటాయ‌ని, సరైన పరిష్కారం కనుగొనేందుకు కేంద్రంతో కలిసి పని చేస్తామని చెప్పారు. వీటికి మూలాలు త‌మ‌కు తెలుసని, అమాయ‌క ప్ర‌జ‌ల్ని చంపే ఘ‌ట‌న‌ల‌ను 30 ఏళ్లుగా కళ్లారా చూస్తున్నాన‌ని అన్నారు. సామాన్యులతోపాటు ఎంతో మంది సైనికులు అమరులయ్యారని తెలిపారు.

‘ఇలా తరచూ దాడులకు పాల్పడితే పాకిస్థాన్‌లో కశ్మీర్‌ భాగమవుతుందని ఆ దేశం తప్పుడు ఉద్దేశంతో ఉంది. అదెప్పటికీ జరగదు. ఎందుకు పాకిస్థాన్ ఈ దాడుల‌కు విధ్వంసానికి పాల్పుడుతోంది. వారి స్వంత భ‌విష్య‌త్తునే ఎందుకు నాశ‌నం చేసుకుంటుంది. మేమేమీ పాకిస్థాన్‌లో భాగం కాదు’ అని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)