Breaking News

లోక్‌సభ ముందుకు మహిళా రిజర్వేషన్‌ బిల్లు

Published on Tue, 09/19/2023 - 14:44

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్‌ బిల్లును లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ మంగళశారం ప్రవేశపెట్టారు.రేపు (బుధవారం) లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ జరగనుంది. ఆ తర్వాత ఓటింగ్‌ నిర్వహించి బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. ఎల్లుండి రాజ్యసభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చించనున్నారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమలు కానున్నాయి.

కాగా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లు కాపీలను తమకు ఎందుకు ఇవ్వలేదని విపక్షాలు ఆందోళన చేపట్టాయి. అయితే డిజిటల్‌ ఫార్మాట్‌లో అప్‌మలోడ్‌ చేశామని కేంద్రం బదులిచ్చింది. ఇక ఈమహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ‘నారీశక్తి వందన్‌’ పేరు పెట్టింది. ఈ బిల్లు కోసం 128 రాజ్యంగ సవరణ చేయనుంది కేంద్రం. బిల్లు పాసైతే పార్లమెంట్‌, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం సీట్లు లభించనున్నాయి. 15 ఏళ్ల పాటు ఈ మహిళా రిజర్వేషన్లు బిల్లు అమల్లో ఉండనుంది.

ఇదిలా ఉండగా లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. బుధవారం ఉదయం​ 11 గంటలకు తిరిగి ప్రారంభం కానుంది. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చించనున్నారు సభ్యులు. కాగా  బిల్లు గురించి మోదీ మాట్లాడుతూ.. ‘నారీ శక్తి వందన్ అధినియం' మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. సెప్టెంబర్‌ 19 చరిత్రలో నిలిచిపోయే రోజని పేర్కొన్నారు. 

ముప్పై ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఈ బిల్లుకు విపక్షాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలని ప్రధాని కోరారు. కొత్త పార్లమెంట్‌ భవనంలో ఇదొక చారిత్రాత్మక సందర్బమని తెలిపారు. తమ ప్రభుత్వం ముఖ్యమైన రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువస్తోందని, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి తమ సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. 
చదవండి: కెనడా విషయంలో ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)