Breaking News

శరీరాకృతిపై వ్యాఖ్యలూ లైంగిక వేధింపులే

Published on Thu, 01/09/2025 - 06:13

కొచ్చి: మహిళ రూపురేఖలను వర్ణిస్తూ ద్వంద్వార్థం ధ్వనించేలా వ్యాఖ్యలు చేసినా, ఎస్‌ఎంఎస్‌ సందేశాలు పంపినా లైంగిక వేధింపుల సెక్షన్ల కింద అవి నేరంగా పరిగణించబడతాయని కేరళ హైకోర్టు స్పష్టంచేసింది. ఒకే కార్యాలయంలో పనిచేసిన కాలంలో తోటి మహిళా ఉద్యోగిపై తాను చేసిన వ్యాఖ్యల కుగాను నమోదైన లైంగిక వేధింపుల కేసులను కొట్టేయాలంటూ కేరళ రాష్ట్ర విద్యుత్‌ బోర్డ్‌ మాజీ ఉద్యోగి చేసిన అభ్యర్థనను జస్టిస్‌ ఏ.బధారుద్దీన్‌ సారథ్యంలోని ధర్మాసనం కొట్టేసింది.

 ఎర్నాకులం జిల్లాలో కేఎస్‌ఈబీ ఆఫీస్‌లో పనిచేసిన కాలంలో 2013 ఏడాది నుంచి తనతో అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని, 2016–17 కాలంలో మొబైల్‌ ఫోన్‌కు తన రూపురేఖలను వర్ణిస్తూ ఎస్‌ఎంఎస్‌లు పంపారని, వాయిస్‌ కాల్స్‌ చేశారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదుచేసింది.

 ఆ తర్వాత సైతం అతని నుంచి ఎస్‌ఎంఎస్‌లు, ఫోన్‌కాల్స్‌ ఆగలేదు. దీంతో భారత శిక్షాస్మృతిలోని 354(ఏ)(1)(4), 509 సెక్షన్లతోపాటు కేరళ పోలీస్‌ చట్టంలోని 120(ఓ) సెక్షన్‌ కింద సదరు ప్రభుత్వ ఉద్యోగిపై కేసు నమోదైంది. అందంగా ఉందని మాత్రమే ఎస్‌ఎంఎస్‌లు పంపానని, ఆ సందేశాల్లో ఎలాంటి తప్పుడు ఉద్దేశంలేదని అతని తరఫు న్యాయవాది చేసిన వాదనలను కోర్టు తిరస్కరించింది. లైంగిక వేధింపుల సెక్షన్లను తొలగించాలంటూ ఆ ఉద్యోగి వేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ జడ్జి తీర్పు చెప్పారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)