Breaking News

కారు కింద ఇరుక్కుందని తెలుసట!

Published on Mon, 01/09/2023 - 05:46

న్యూఢిల్లీ: ఢిల్లీలో డిసెంబర్‌ 31వ తేదీ అర్ధరాత్రి దాటాక స్కూటీపై వెళ్తున్న అంజలీ సింగ్‌ను ఢీకొట్టి, 12 కిలోమీటర్లు లాక్కెళ్లిన ఘటనలో పోలీసు విచారణలో మరికొన్ని విషయాలు వెలుగు చూశాయి. తమ కారు కింద ఒక మహిళ ఇరుక్కుపోయిన విషయం తెలుసునని, కారాపి ఆమెను విడిపించినప్పటికీ హత్య కేసు నమోదవుతుందని భయపడ్డామని నిందితులు తెలిపారని పోలీసులు ఆదివారం వెల్లడించారు. అందుకే, మహిళ శరీరం కారు నుంచి విడిపోయేదాకా ఆపకుండా నడిపినట్లు చెప్పారన్నారు.

సుల్తాన్‌పురి నుంచి కంఝావాలా వరకు పలుమార్లు కారును యూ టర్న్‌ తీసుకుని 12 కిలోమీటర్ల మేర అంజలిని లాక్కెళ్లగా ఆమె తీవ్ర గాయాలతో చనిపోయిన విషయం తెలిసిందే. తమ కారు కింద ఒక మహిళ ఇరుక్కున్న విషయం తెలియదని, విషయం తెలిశాక అక్కడి నుంచి పరారైనట్లు అంతకుముందు నిందితులు తెలిపిందంతా అబద్ధమని తేలింది. అంజలి, తన స్నేహితురాలు నిధి కలిసి స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో నిధి స్వల్పగాయాలతో బైటపడగా, అంజలి కారు కింద ఇరుక్కుంది. కాగా, ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)