Breaking News

ఎంత ఘోరం.. కొడుకుని కాలువలో పడేసిన తల్లి.. మొసళ్లు కొరకడంతో

Published on Mon, 05/06/2024 - 14:43

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో అమానుష​ ఘటన వెలుగుచూసింది. భార్యభర్తల గొడవ ఆరేళ్ల బాలుడి ప్రాణాలు తీసింది. దంపతుల మధ్య వివాదం కారణంగా ఆరేళ్ల మూగవాడైన కొడుకును కాలువలో పడేయడంతో అందులోని మొసళ్లు బాలుడిని కొరికి చంపేశాయి.. వివరాలు.. ఉత్తర కన్నడ జిల్లా, దండెలి తాలూకాలో నివసించే సావిత్రి అనే 33 ఏళ్ల మహిళ సావిత్రికి, భర్త రవికుమార్‌, కుమారులు వినోద్‌(6)‌, రెండేళ్ల బాలుడు ఉన్నారు. సావిత్రి ఇంట్లో పనులు చేస్తూ జీవిస్తుండగా రవి తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు.

కాగా పెద్ద కొడుక్కి చెవులు వినబడకపోవడం, మాటలు రాకపోవడంతో అతడి విషయంలో గత కొంతకాలంగా దంపతుల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. గత శనివారం వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఆవేశంతో సావిత్రి తన కొడుకుని ఉత్తర కన్నడ జిల్లాలోని ఓ కాలువలో పడేసింది. అయితే ఆ కాలువలో మూసళ్లు ఉండటంతో బాలుడిని దారుణంగా కొరికి చంపేశాయి.

దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. అదే రోజు రాత్రి కాలువలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. మరుసటి రోజు ఉదయం బాలుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహం అంతా కొరికిన గుర్తులు ఉండగా, బాలుడి కుడి చేయి కూడా కనిపించలేదు. దీంతో చిన్నారిని మొసళ్లు కొరికి చంపేసి ఉంటాయని పోలీసులు నిర్ధారించారు. తల్లిదండ్రులు రవి, సావిత్రి ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

అయితే తన కొడుక్కి చావుకు భర్తే బాధ్యుడని సావిత్రి పేర్కొంది. మూగ కుమారుడిని ఎందుకు కన్నావ్‌ అంటూ రవి తనతో పదే పదే గొడవపడేవాడని సావిత్రి తెలిపింది. తినడం తప్ప ఏం చేతగాని కొడుకును కాల్వలో పడేసి చంపేస్తానని బెదిరించేవాడని చెప్పింది. ‘నా భర్త అలా మాట్లాడుతుంటే, కొడుకు మాత్రం ఎంత టార్చర్ భరించగలడు. నా బాధను ఎవరితో చెప్పుకోగలను’ అని పేర్కొంది. చివరికి ఇద్దరిని అరెస్ట్‌ చేసిన పోలీసులు వారిపై హత్యకేసు నమోదు చేశారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)