Breaking News

ఏసీ కోచ్‌లో యువతి స్మోకింగ్‌.. ‘నా డబ్బుతో కొనుక్కున్న సిగరెట్‌.. మీకెందుకంత బాధ?’

Published on Mon, 09/15/2025 - 21:35

సాక్షి,విశాఖపట్నం: విశాఖపట్నం-గాంధీధామ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20803)లో జరిగిన ఓ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో..  ఏసీ కోచ్‌లో ఓ యువతి సిగరెట్‌ తాగుతూ ఇతర ప్రయాణికులతో వాగ్వాదానికి దిగింది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో చక్కెర్లు కొడుతున్నాయి. 

ఇక ఆ వీడియోను పరిశీలిస్తే.. యువతి సిగరెట్‌ తాగుతుండగా.. ఓ యువకుడు ఆమెను ప్రశ్నిస్తూ వీడియో తీస్తుంటారు. ‘ఏం చేస్తున్నారు మీరిక్కడ? ట్రైన్‌ లోపల ఎందుకు సిగరెట్‌ తాగుతున్నారు? ఇది ఏసీ కోచ్‌ మీకు కనిపించడం లేదా? అని ప్రశ్నిస్తాడు. 

దీంతో వీడియో తీస్తున్నారని గమనించిన ఆ ప్రయాణికురాలు.. యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  మీరు నన్నెందుకు వీడియో తీస్తున్నారు. వెంటనే డిలీట్‌ చేయండి అంటూ బెదిరింపులకు దిగింది. అందుకు ఆ యువకుడు ఒప్పుకోకపోవడంతో.. నీకెందుకు బ్రదర్‌.. ఇది నీ ట్రైన్‌ కాదు కదా ప్రశ్నించింది. ఓ చేతిలో సిగరెట్‌ పట్టుకుని.. ఈ సిగరెట్‌ను నా సొంత డబ్బుతో కొనుక్కొని తాగుతున్నా మీకెందుకు అని మరింత గట్టిగా కేకలు వేసింది.  

కేకలు విన్న తోటి ప్రయాణికులు ..యువతిని ట్రైన్‌లో సిగరెట్‌ తాగడం ఆపాలని కోరారు. అయితే ఆమె వారి మాటలను పట్టించుకోకుండా.. ఇది మీ ట్రైన్ కాదు కదా, మీకు ఎందుకు బాధ? అని కసురుకుంది.  

నేను లోపలికి వెళ్లను. నా వీడియో ఎందుకు డిలీట్ చేయడం లేదు? అని ప్రశ్నించింది. అందుకు తోటి ప్రయాణికులకు చిర్రెత్తడంతో యువతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  చేసేది లేక చివరికి ఆమె తన బెర్త్‌కి వెళ్లి ఇప్పుడు పోలీసులను పిలవండి అంటూ సవాల్ విసిరింది. ఈ వీడియో ఎప్పుడు రికార్డ్‌ చేశారో తెలియాల్సి ఉండగా.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోపై  రైల్వే శాఖ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)