Breaking News

‘నో ఇంగ్లీష్‌.. నో హిందీ.. ఓన్లీ కన్నడ’.. మహిళ ట్వీట్‌ వైరల్‌

Published on Thu, 07/18/2024 - 09:27

బెంగళూరు : కర్ణాటకలోని ప్రైవేట్‌ సంస్థల్లో కన్నడిగులకే 100 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందంటూ సీఎం సిద్ధరామయ్య ట్వీట్‌ చేశారు. కేబినెట్‌ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు రావడంతో సిద్ధరామయ్య ఆ ట్వీట్‌ను తొలగించారు. అయినప్పటికీ దుమారం కొనసాగుతూనే ఉంది.

ఈ తరుణంలో బెంగళూరులోని ఓ కార్పొరేట్‌ సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి తాను ‘కన్నడ భాష విషయంలో తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నాను. అందుకే బెంగళూరు వదిలి వెళ్లిపోతున్నాను’ అంటూ చేసిన థ్రెడ్‌ పోస్ట్‌కి 14 లక్షల ఇంప్రెషన్స్‌ వచ్చాయి.

పంజాబ్‌కు చెందిన షానీనాని ఇండియా సిలికాన్‌ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ఏడాదిన్నపాటు ఉన్నారు. బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లయి కంపెనీ లిమిటెడ్‌ సంస్థలో కస్టమర్‌ సపోర్ట్‌ ఎగ్జిక్యూటీవ్‌గా విధులు నిర్వహించేవారు. అయితే ఈ ఏడాదిన్నర కాలంలో బెంగళూరులో తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

నాకు పెళ్లైంది. ఏడాది పాటు పంజాబి సంప్రదాయ వస్త్రదారణలో ఆఫీస్‌కి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో నా వస్త్రదారణ చూసిన వారు నేను పంజాబీ అని గుర్తించేవారు. ఆఫీస్‌ వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఆటో ఎక్కాల్సి వచ్చినా, లేదంటే ఇతర వస్తువులు కొనుగోలు చేసిన మార్కెట్‌ రేటు కంటే తన వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారు. కొన్నిసార్లు మొహం మీదే కన్నడ నేర్చుకోమని వివక్షచూపుతూ మాట్లాడేవారు.

ఓరోజు నా ఆఫీస్‌లో కరెంట్‌యింది. వెంటనే ఆఫీస్‌లోని ఎలక్ట్రిక్‌ విభాగానికి నేరుగా ఫిర్యాదు చేశా. అక్కడ కూడా నాకు చేదు అనుభవమే ఎదురైంది. అందులో ఓ ఉద్యోగికి సమస్యను పరిష్కరించాలని హిందీ, ఇంగ్లీష్‌లో అడిగా. నో హిందీ,నో ఇంగ్లీష్‌.. ఓన్లీ కన్నడ.. కన్నడలో మాట్లాడండి. మీసమస్యను పరిష్కరిస్తానని చెప్పడంతో కంగుతినట్లు చెప్పారు.

ఇలా వర్ణించలేని ఇబ్బందులు ఎదుర్కొన్నాని, అందుకే బెంగళూరు వదిలి గురుగ్రామ్‌ వెళ్లినట్లు చెప్పారు. నేను నా ఇంటికి వచ్చా. సంతోషంగా ఉన్నాను. ఇన్ని రోజులు ఎన్నో అవమానాల్ని ఎదుర్కొన్నాను. మంచి ఆహారం తింటాను, నేను కోరుకున్న చోటికి వెళ్లగలుగుతున్నాను అని వ్యాఖ్యానించారు. కాగా, చాలా మంది నెటిజన్లు ఆమెకు సపోర్ట్‌ చేస్తుండగా.. మరికొందరు కన్నడ నేర్చుకుంటే తప్పేముంది.’ అని కామెంట్లు చేస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)