Breaking News

బుల్లెట్ బైక్‌ నడపడం రాదని భర్తను వదిలేసిన భార్య

Published on Sat, 01/31/2026 - 11:01

(కర్ణాటక) దొడ్డబళ్లాపురం: దొడ్డబళ్లాపుర తాలూకాలో ఖతర్నాక్‌ కిలేడీ లీలలు వెలుగు చూశాయి. వివాహమై పిల్లలు ఉన్నా మరో ఇద్దరు వ్యక్తులను మోసం చేసి వివాహం చేసుకుని రూ.లక్షల్లో డబ్బు దోచుకున్నారు. ఈ కిలేడీ బాగోతాన్ని మోసపోయిన భర్తలు బయటపెట్టారు. దొడ్డ తాలూకాలోని హణబె గ్రామానికి చెందిన సుధారాణిపై ఈమేరకు ఆరోపణలు వచ్చాయి. బాధితుల కథనం మేరకు వివరాలు.. వీరేగౌడ అనే వ్యక్తిని సుధారాణి మొదటి వివాహం చేసుకుంది. 

వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే మొదటి భర్తతో సంతృప్తి చెందని సుధారాణి అతడికి బుల్లెట్‌, కారు లేదని అసలు నడపడమే రాదనే సాకులు చెప్పి గొడవపడి పిల్లలను, భర్తను వదిలి చేతికందినంత డబ్బు, నగలు తీసుకుని వెళ్లిపోయింది. తరువాత డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న అనంతమూర్తి అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. తనకు భర్త లేడని, చనిపోయాడని, ఒంటరిగా జీవిస్తున్నానని చెప్పుకుంది. తరువాత మాయ మాటలు చెప్పి అనంతమూర్తిని ఒక గుడిలో వివాహం చేసుకుని 18 నెలలు సంసారం చేసింది. 

ఈ ఏడాదిన్నర కాలంలో పలు కారణాలు చెప్పి అనంతమూర్తి వద్ద రూ.20 లక్షల వరకూ నగదు తీసుకుంది. డబ్బులు తీసుకున్నాక సుధారాణి అనంతమూర్తిని వదిలి కనకపురకు చెందిన మరో డబ్బున్న వ్యక్తిని ట్రాప్‌ చేసింది. ఈ విషయం తెలుసుకున్న మొదటి భర్త వీరేగౌడ, రెండవ భర్త అనంతమూర్తి ఇద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమాయకులను మోసం చేసి వివాహం చేసుకున్నట్టు నాటకమాడి తరువాత వారి నుంచి డబ్బులు గుంజి వదిలేస్తున్న సుధారాణిపై చట్టపరంగా చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Videos

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)