Breaking News

కాలువలో మొండెం.. వెలుగులోకి భార్య కిరాతకం

Published on Tue, 12/23/2025 - 12:24

సంభల్: ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో వెలుగు చూసిన ఒక దారుణ హత్యోదంతం  అందరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ఒక ఇల్లాలు తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా హత్యచేసింది. అంతటితో ఆగకుండా మృతదేహం ఆనవాళ్లు దొరకకూడదని దానిని ముక్కలు ముక్కలుగా నరికి, వేర్వేరు ప్రాంతాల్లో పారేసిన వైనం స్థానికంగా సంచలనంగా మారింది.

నవంబర్ 18న తన భర్త రాహుల్ అదృశ్యమయ్యాడంటూ భార్య రూబీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ హైడ్రామా మొదలైంది. డిసెంబర్ 15న  ఇక్కడి ఒక కాలువలో తల, కాళ్లు, చేతులు లేని మొండెం పోలీసులకు లభించింది. ఆ మొండెంపై ఉన్న ‘రాహుల్’ అనే పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులకు రూబీపై అనుమానం కలగడంతో అసలు నిజం బయటపడింది.

పోలీసుల విచారణలో నిందితులు చెప్పిన వివరాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. రూబీ, ఆమె ప్రియుడు గౌరవ్ కలిసి రాహుల్‌ను ఇనుప రాడ్డు, రోకలితో కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు ఒక చెక్కలు కోసే గ్రైండర్‌ను తీసుకువచ్చి, మృతదేహాన్ని ముక్కలుగా కోశారు. ఒక భాగాన్ని కాలువలో పడేయగా, మిగిలిన శరీర భాగాలను రాజ్‌ఘాట్‌కు తీసుకెళ్లి పవిత్ర గంగా నదిలో కలిపేసి ఏమీ తెలియనట్టు నాటకమాడారు.

నిందితులు హత్యకు ఉపయోగించిన గ్రైండర్, ఇనుప సుత్తి మరియు ఇతర పనిముట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రూబీ, గౌరవ్‌లను అరెస్టు చేసి జైలుకు తరలించారు. మృతదేహం రాహుల్‌దేనని నిరూపించేందుకు అతని పిల్లల డీఎన్‌ఏ నమూనాలను సేకరించి, ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది  కూడా చదవండి: రాజ్యాంగం రద్దుకు బీజేపీ కుట్ర: రాహుల్ ఆరోపణ

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)