Breaking News

విషాద మలుపుల ప్రేమ

Published on Sun, 01/19/2025 - 07:33

కృష్ణరాజపురం: బెంగళూరులో ప్రేమ వ్యవహారాలు ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవల పెళ్లయిన యువతి, అవివాహిత యువకుడు ప్రేమ ఫలించలేదని ఆత్మహత్యలు చేసుకోవడం తెలిసిందే. 

ప్రేయసిని ఓ ప్రియుడు చంపిన ఘటన కుందలహళ్లిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటన పూర్వాపరాలు.. ఉజ్మాఖాన్‌, ఇమ్దాద్‌ బాషా, ఇద్దరూ టెక్కీలుగా పనిచేసేవారు. పరస్పరం ప్రేమలో ఉన్నారు. అయితే వారి ప్రేమను వారి కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో ఇద్దరూ వేర్వేరుగా పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ ఇటీవల ఇద్దరూ విడాకులు తీసుకుని మళ్లీ తమ పాత ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించారు. గత నెల 30న కుందలహళ్లిలో కలుసుకున్నారు. ఆ సమయంలో ఏదో విషయానికి వాగ్వాదం జరగడంతో ప్రియుడు ఇమ్దాద్‌ బాషా ఆమెను గొంతు పిసికి చంపేశాడు. చాలా గంటలపాటు అక్కడే ఒంటరిగా గడిపాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు తామిద్దరం విషం తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వాట్సాప్‌ మెసేజ్‌ చేశాడు.

పోస్టుమార్టంలో ఇలా
బంధువులు చేరుకుని చూడగా ఉజ్మాఖాన్‌ మరణించి ఉంది, అతడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. మృతదేహానికి జరిపిన పోస్టుమార్టం నివేదికలో ఇమ్దాద్‌ బాషా మెసేజ్‌ చేయడానికి 10 గంటల ముందే ఆమె మరణించినట్లు వెలుగులోకి వచ్చింది. ఇమ్దాద్‌ బాషాను అదుపులోకి తీసుకున్న హెచ్‌ఏఎల్‌ పోలీసుల విచారణలో మరొక టెక్కీ యువకునితో ఉజ్మాఖాన్‌ చనువుగా ఉంటోందని, అతనిని పెళ్లి చేసు కుంటానని చెప్పడం వల్లనే తాను ఆమెను చంపేసినట్లు ఒప్పకున్నాడు. అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)