Breaking News

కారులో మహిళ.. కళ్లు తెరిచేంతలో మృతి

Published on Thu, 10/30/2025 - 16:26

పూణె: ప్రతిమనిషికి ఏదో ఒకరోజు మృత్యువు సంభవిస్తుందనేది అందరికీ తెలిసిందే. అయితే  అది ఎలా వస్తుందనేది ఎవరూ చెప్పలేరు. కొందరికి ఎవరూ ఊహించని విధంగా మృత్యువు వాటిల్లుతుంది. ఇటువంటి ఘటనే అత్యంత ఖరీదైన కారులో విలాసవంతగా వెళుతున్న మహిళకు ఎదురయ్యింది. పూణే నుండి మాంగావ్‌కు వోక్స్‌వ్యాగన్ వర్టస్ కారులో వెళుతున్న ఒక మహిళ  అకస్మాత్తుగా మృత్యువాత పడింది.

కొండపై నుంచి ఒక పెద్ద బండరాయి ఆమె వెళుతున్న కారుపై పడి, అది కారు సన్‌రూఫ్‌ను  చీల్చుకొని, అమాంతం కారులోని ఆమెపై పడింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలిని గుజరాత్‌కు చెందిన స్నేహల్(43)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని తమ్హిని ఘాట్‌లో చోటుచేసుకుంది.

మరో ఘటనలో ముంబై నుండి జల్నాకు వెళుతున్న ఒక ప్రైవేట్ లగ్జరీ బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటన హైవేలోని నాగ్‌పూర్ లేన్‌లో  చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్, అతని సహాయకునితో పాటు 12 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తమైన బస్సులోని ప్రయాణికులకు కిందకు దింపి, వారి ప్రాణాలను కాపాడాడు. ఇదేవిధంగా అక్టోబర్ 18న మహారాష్ట్రలోని నందూర్‌బార్ జిల్లాలో వేగంగా వస్తున్న మినీ ట్రక్కు లోయలో పడటంతో ఎనిమిది మంది మృతిచెందారు. 15 మంది గాయపడ్డారు.

ఇది కూడా చదవండి: Sudan: ఉపగ్రహ చిత్రాల్లో సామూహిక రక్తపాత దృశ్యాలు

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)