Breaking News

బైక్‌ ట్యాక్సీ రైడర్‌ వికృత చేష్టలు.. బైక్‌పై నుంచి దూకిన మహిళ! 

Published on Wed, 04/26/2023 - 08:37

బనశంకరి: బైక్‌ ట్యాక్సీ రైడర్‌ లైంగిక వేధింపుల నుంచి తప్పించుకోవడానికి బైకు నుంచి కిందకు దూకిన యువతి గాయపడిన ఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. బాధితురాలు (30) ప్రైవేటు ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తోంది. ఈ నెల 21న రాత్రి 11.30 గంటల సమయంలో ఇందిరానగర్‌కు వెళ్లడానికి ర్యాపిడో బైక్‌ను యాప్‌లో బుక్‌ చేసింది. 

ఈ క్రమంలో యువతిని పికప్‌ చేసుకున్న బైకర్‌ ఆమె మొబైల్‌ను లాక్కుని, కౌగిలించుకుని వెకిలిచేష్టలు చేశాడు. వెళ్లాల్సిన చోటుకు కాకుండా వేరే మార్గంలో తీసుకెళ్తుండగా యువతి అతడిని ప్రశ్నించింది. సమాధానం ఇవ్వకుండా మరింత వేగంగా బైక్‌ను పోనిచ్చాడు. పైగా అతడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. భయాందోళనకు గురైన ఆమె బీఎంఎస్‌  ఇన్‌స్టిట్యూట్‌ వద్ద బైకు నుంచి దూకడంతో గాయపడింది. ఒక స్నేహితురాలికి, అలాగే పోలీసులకు కాల్‌ చేసి సాయం అడిగింది. అయితే పోలీసులు ఇది ప్రేమికుల గొడవ అనుకుని స్పందించలేదని బాధితురాలు తెలిపింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చివరకు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ర్యాపిడో బైకర్‌ను అరెస్ట్‌ చేశారు. అతనిపై కిడ్నాప్, వేధింపులు, లైంగికదాడికి యత్నం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)