Breaking News

జంతర్‌మంతర్‌: సీజేపీ చీఫ్‌ అభిజిత్‌పై ఇంక్‌ దాడి

Published on Sat, 07/18/2026 - 15:30

ఢిల్లీ జంతర్‌మంతర్‌ దగ్గర మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఓ మహిళ ఇంక్‌ చల్లింది. ఉదయం నుంచి జంతరమంతర్‌ దగ్గర దీప్కే నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ పోరాటానికి మద్దతుగా సోనం వాంగ్‌చుక్‌ జంతర్‌ మంతర్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వాంగ్‌చుక్‌ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఢిల్లీ పోలీసులు శనివారం ఉదయం ఆయనను సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించారు.

ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు, వైద్య నిపుణుల సూచనల మేరకే ఈ చర్య తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే ఈ చర్యపై సీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాంగ్‌చుక్‌ శాంతియుతంగా నిరసన చేస్తున్న సమయంలో పోలీసులు బలవంతంగా తరలించారని ఆరోపించారు. ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం జంతర్ మంతర్ దగ్గర మరో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. దీప్కే ప్రసంగిస్తుండగా ఓ మహిళ ఆయనపై సిరా లాంటి ద్రవాన్ని విసిరింది. దీంతో గందరగోళం నెలకొంది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీనిపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

20 రోజులుగా చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలో వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించడంతో.. శనివారం తెల్లవారుజామున పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. నిరసనకారులు పోలీసుల చర్యను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో కాసేపు తోపులాట జరిగింది. నీట్‌ పరీక్షలో జరిగిన అక్రమాలపై సీజేపీ నేతృత్వంలో జరుగుతున్న నిరసనకు మద్దతుగా జూన్ 28 నుంచి వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయనను పర్యవేక్షిస్తున్న వైద్యులు.. ఈ దీక్షలో ఆయన దాదాపు 9.5 కిలోల బరువు తగ్గారని తెలిపారు.

#

Tags : 1

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)