Breaking News

చెత్త బండీలో మహిళ మృతదేహం.. దారుణానికి పాల్పడ్డ లివ్‌ ఇన్‌ పార్ట్‌నర్‌

Published on Mon, 06/30/2025 - 12:51

బెంగళూరు: దేశంలో మహిళలపై  అఘాయిత్యాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పసివయసు వారి నించి వృద్ధ మహిళల వరకూ ఎక్కడో ఒకచోట ప్రతీరోజూ అకృత్యాలకు గురవుతూనే ఉన్నారు. తాజాగా ఇటువంటి దారుణ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. మహిళను నమ్మించి, ఆమెతో సహజీవనం సాగించి, ఆనక ఆమెను కడతేర్చిన ప్రబుద్ధుని ఉదంతం కలకలం రేపుతోంది.

బెంగళూరులో ఒక మహిళ మృతదేహాన్ని ఒక చెత్త ట్రక్కులో పోలీసులు కనుగొన్నారు. ఆ మృతదేహాన్ని ఒక సంచిలో ఉంచి, దానిని చెత్త ట్రక్కులో పడవేసినట్లు గుర్తించారు. ఈ ఉదంతంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ మహిళను ఆమె లివ్‌ ఇన్‌ పార్ట్‌నర్‌ హత్య చేశాడని కనుగొన్నారు. మృతురాలిని ఆశ(40)గా పోలీసులు గుర్తించారు. ఆమెకు మహ్మద్ షంషుద్దీన్(33) అనే వ్యక్తితో సంబంధం ఉందని, అతనే ఆమెను హత్య చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

బెంగళూరు పౌర సంస్థ బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) సిబ్బంది ఒక చెత్త ట్రక్కులో మహిళ మృతదేహం కలిగిన గోనె సంచిని చూసింది. ఆ మహిళ చేతులను కట్టివేసి, గొనె సంచిలో కుక్కివేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న బెంగళూరు పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టంనకు పంపి,  కేసు దర్యాప్తు ప్రారంభించారు.

మృతురాలికి సంబంధించిన ఆధారాలను సేకరించిన పోలీసులు నిందితుడిని అస్సాంకు చెందిన మహ్మద్ షంషుద్దీన్‌గా గుర్తించారు. నిందితుడు ఆశతో ఏడాదిన్నరగా లివ్‌ ఇన్‌లో ఉన్నాడు. వారిద్దరూ దక్షిణ బెంగళూరులోని హులిమావులో ఒక అద్దె ఇంట్లో కలిసి  ఉన్నారు. నిందితుడు, బాధితురాలికి గతంలోనే వేర్వేరుగా వివాహాలు కాగా, వారికి పిల్లలు కూడా ఉన్నారు.  అయితే ఆశ,మహ్మద్ షంషుద్దీన్‌లు తాము భార్యాభర్తలమని చుట్టుపక్కల వారికి చెప్పేవారు.

ఆశా అర్బన్ కంపెనీలో పనిచేస్తూ, గృహనిర్వాహక సేవలను అందిస్తుంటుంది. మహమ్మద్ షంషుద్దీన్  భార్య, ఇద్దరు పిల్లలు అస్సాంలోనే ఉన్నారు. ఈ కేసు గురించి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) లోకేష్ బి జగల్సర్‌ మాట్లాడుతూ ఆశ, షంషుద్దీన్‌ మధ్య గొడవ జరిగిందని, అది మరింత తీవ్రం కావడంతో షంషుద్దీన్.. ఆశను గొంతు కోసి చంపాడని తెలిపారు. తరువాత అతను ఆశ మృతదేహాన్ని గొనె సంచిలో కుక్కివేసి, దానిని బైక్‌పై తీసుకువెళ్లి చెత్త ట్రక్కులో పడవేసి అక్కడి నుండి పారిపోయాన్నారు. అయితే ఈ ఘటన సీసీటీవీలో రికార్డు కావడంతో నిందితుడు పట్టుబడ్డాడని జగల్సర్‌ తెలిపారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)