Breaking News

పెళ్లి కోసం ‘రీల్స్‌’లో ఆస్తి చూపించాడు.. వివాహమైన రెండు గంటలకే..

Published on Sun, 06/29/2025 - 13:28

జబల్పూర్: దేశంలో ఇటీవలి కాలంలో భర్తలపై హత్యలకు తెగబడుతున్న మహిళల ఉదంతాలు కలకలం రేపుతున్నాయి. ఇటువంటి ఘటనలను విన్నవారు విస్తుపోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. జబల్పూర్‌కు  చెందిన ఇంద్ర కుమార్ తివారీ(45)ని పెళ్లి పేరుతో వంచించి, అతనిని అంతమొందించిన సాహిబా బానో అనే మహిళను ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు అరెస్టు చేశారు.

జూన్ 6న ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్‌లోని హటా ప్రాంతంలోని ఒక కాలువలో ఒక పురుషుని మృతదేహం బయటపడిన దరిమిలా ఈ దారుణం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేశారు. తొలుత ఈ మృతదేహం  ఎవరిదైనదీ తెలియలేదు.  దర్యాప్తులో కొన్ని వారాల తర్వాత జబల్పూర్‌లో అదృశ్య వ్యక్తితో ఈ మృతదేహాన్ని పోల్చి చూడగా, అది ఇంద్ర కుమార్ తివారీ మృతదేహమని తేలింది.

ఈ హత్య వెనుక సూత్రధారి సాహిబా బానో అని, ఆమె ఖుషీ తివారీగా పేరు మార్చుకుని ఇంద్రకుమార్‌ను ఆకట్టుకున్నదని పోలీసులు తెలిపారు. పెళ్లికాని ఇంద్రకుమార్‌ ఇటీవల తనకు గల భూమి వివరాలను చెబుతూ ఒక రీల్‌ చేసి, సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీనిని చూసిన  సాహిబా బానో  ఆ భూమిని  దక్కించుకోవాలనే ఆశతో, అతనిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది.

సోషల్ మీడియాలో అతనిని సంప్రదించి, తన పేరు ఖుషీ తివారీ అని పరిచయం చేసుకుని, గోరఖ్‌పూర్‌కు రావాలని ఆహ్వానించింది. తర్వాత తన ఇద్దరు సహచరుల సహాయంతో ఇంద్రకుమార్‌ను వివాహం చేసుకుంది. కొన్ని గంటల తర్వాత తివారీని హత్య చేసి, అతని మృతదేహాన్ని తన సహచారుల సాయంతో కాలువలో పడేసింది. ఈ కేసులో పోలీసులు సాహిబాతో ఆమెకు సహకరించిన ఇద్దరినీ అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)