Breaking News

మరిది.. నీ భార్యకు వేరొకరితో సంబంధం ఉంది!

Published on Tue, 12/23/2025 - 13:41

తమిళనాడు: తన భార్యతో తరచూ ఘర్షణ పడుతుందనే కారణంతో వదిననూ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన మరిదిని మప్పేడు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌ ఇరుళంజేరి గ్రామానికి చెందిన ఇళయరాజ. ఇతడికి అదే ప్రాంతానికి చెందిన శాంతిమేరితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు వున్నారు.

కాగా ఇళయరాజ సోదరుడు ఇసైమేగం(29). ఇతడికి పేరంబాక్కం గ్రామానికి చెందిన లావణ్య(24)తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం లావణ్య మూడు నెలల గర్బవతి. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబంగా నివాసం ఉంటున్నారు. కాగా శాంతిమేరికి వివాహమై రెండు సంవత్సరాల తరువాత పిల్లలు పుట్టగా, లావణ్యకు వివాహమైన నాలుగు నెలలకే గర్బం దాల్చింది. ఈ విషయమై శాంతిమేరి తరచూ లావణ్యకు వివాహానికి ముందే వేరొకరితో సంబంధం ఉందంటూ ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తోంది.

 ఇదే విషయమై ఆదివారం రాత్రి శాంతిమేరికి, లావణ్యకు చిన్నపాటి ఘర్షణ జరగడంతో ఆగ్రహించిన ఇసైమేగం తన భార్యకు అక్రమ సంబందాన్ని అంటగట్టుతున్నారనే ఆగ్రహంతో వదినపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డన శాంతిమేరిని స్థానికులు చికిత్స కోసం తిరువళ్లూరుకు తరలించగా మార్గంమధ్యలోనే మృతిచెందింది. ఈ ఘటన ఇరుళంజేరిలో తీవ్ర సంచనలం కలిగింది. మప్పేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

 

Videos

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు