Breaking News

'నన్ను వేధిస్తున్నాడు..' ఎమ్మెల్యేపై మహిళా పోలీసు ఆరోపణలు

Published on Sat, 08/12/2023 - 16:42

చిక్కమంగళూరు: కాంగ్రెస్ ఎమ్మెల్యే తనను వేధిస్తున్నాడని ఆరోపణలు చేసింది ఓ మహిళా పోలీసు. కక్షపూరితంగా తనను బదిలీ చేయించి ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఆమె తన వాట్సాప్ స్టేటస్‌లో ఈ విషయాన్ని తెలిపింది. ఈ వ్యవహారంలో ఆమెపై చర్యలకు ఉపక్రమించిన ఉన్నతాధికారులు.. సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కర్టాటకకు చెందిన మహిళా పోలీసు లత. చిక్కమంగళూరు జిల్లాలోని కాడూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కే.ఎస్. ఆనంద్ తనను వేధిస్తున్నాడని ఆరోపణలు చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో హెల్మెట్ లేని కారణంగా కాంగ్రెస్ కార్యకర్తకు జరిమానా విధించింది మహిళా పోలీసు లత. ఈ విషయంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఆనంద్ అప్పట్లో తనతో వాగ్వాదానికి దిగాడని ఆమె తెలిపింది. ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే.. ఎన్నికల అనంతరం మహిళా పోలీసు లత కాడూరు స్టేషన్ నుంచి టరికేరి స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ బదిలీపై అధికారి లత నిరసన వ్యక్తం చేశారు. తనను కక్షపూరితంగా బదిలీ చేయడంపై లత.. ఎమ్మెల్యేకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే.. ఈ ఘటనల అనంతరం లత.. తనను ఎమ్మెల్యే ఆనంద్ వేధిస్తున్నాడని వాట్సాప్ స్టేటస్ పెట్టారు. తనకు ఏమైనా.. ఎమ్మెల్యేనే కారణమని పేర్కొంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ ఉమా ప్రశాంత్ ఆమెను సస్పెండ్ చేశారు.

ఇదీ చదవండి: 'మణిపూర్ సమస్యకు సర్జికల్‌ స్ట్రైక్‌ ఒక్కటే మార్గం..'
 


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)