Breaking News

కలకత్తా ఐఐఎంలో అఘాయిత్యం 

Published on Sun, 07/13/2025 - 05:15

కోల్‌కతా: ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) కలకత్తా క్యాంపస్‌లో ఘోరం జరిగింది. ఓ మహిళపై విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తు మందు కలిపిన పానీయం తాగించాడని, తాను అపస్మారక స్థితిలోకి చేరుకున్న తర్వాత అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించారు. కోల్‌కతాలోని హరిదేవ్‌పూర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, నిందితుడు మహావీర్‌ తొప్పాన్నవర్‌ అలియాస్‌ పరమానంద జైన్‌ను అదుపులోకి తీసుకున్నారు. శనివారం నగరంలోని అలీపూర్‌ కోర్టులో ప్రవేశపెట్టగా, నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం ఏడు రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌  ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 19వ తేదీన అతడిని మళ్లీ తమ ఎదుట ప్రవేశపెట్టాలని పోలీసులకు సూచించారు. తనకు బెయిల్‌ మంజూరు చేయాలని నిందితుడు కోరగా మేజిస్ట్రేట్‌ తిరస్కరించారు.  

ఆన్‌లైన్‌ ద్వారా సంప్రదింపులు  
కోల్‌కతాకు చెందిన మహిళ క్లినికల్‌ సైకాలజిస్ట్‌గా పని చేస్తున్నారు. విద్యార్థులకు, యువతకు కౌన్సిలింగ్‌ ఇస్తుంటారు. ఐఐఎం క్యాంపస్‌లో చదువుకుంటున్న విద్యార్థి కౌన్సిలింగ్‌ తీసుకుంటానని ఆన్‌లైన్‌ ద్వారా ఆమెను సంప్రదించాడు. శుక్రవారం సదరు మహిళను తమ హాస్టల్‌కు రప్పించాడు. హాస్టల్‌ గదికి చేరుకున్న తర్వాత ఆమెకు డ్రగ్స్‌ కలిపిన పానీయం అందజేశాడు. అది సేవించి ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్ని గంటల తర్వాత తేరుకున్న బాధితురాలు తనపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. 

అతడిని గట్టిగా నిలదీయడంలో బెదిరింపులకు గురి చేశాడు. ఈ విషయం బయటపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. బాధితురాలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిన ఘోరాన్ని వివరించారు. పోలీసులు రంగంలోకి దిగి, శుక్రవారం రాత్రి నిందితుడు పరమానంద జైన్‌ను అరెస్టు చేశారు. ఈ ఉదంతంపై ఐఐఎం–కలకత్తా యాజమాన్యం స్పందించింది. తమ విద్యార్థిపై ఒక మహిళ ఫిర్యాదు చేసినట్లు తెలిసిందని వెల్లడించింది. ఆమె తమ సంస్థకు చెందిన మహిళ కాదని స్పష్టంచేసింది.   

కోల్‌కతాలో వరుస ఘటనలు  
పశి్చమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో మహిళలపై అత్యాచార ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గత ఏడాది ఆగస్టు 9న ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ, హాస్పిటల్‌లో జూనియర్‌ డాక్టర్‌పై అత్యాచారం జరగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అలాగే 15 రోజుల క్రితం కోల్‌కతాలోని న్యాయ కళాశాలలో 24 ఏళ్ల విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ముగ్గురు వ్యక్తులు సెక్యూరిటీ గార్డుతో కలిసి ఆమెను రేప్‌ చేసినట్లు కేసు నమోదైంది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.  

అత్యాచారం జరగలేదు..  ఆటో నుంచి కింద పడిపోయింది   
ఐఐఎం–కలకత్తా క్యాంపస్‌ హాస్టల్‌లో అత్యాచారానికి గురైన మహిళ తండ్రి భిన్నంగా స్పందించారు. తన కుమార్తెపై అత్యాచారం జరగలేదని, ఆటోలో ప్రయాణిస్తూ కింద పడిపోవడంతో స్వల్పంగా గాయాల పాలైందని శనివారం చెప్పారు. శుక్రవారం రాత్రి 9.34 గంటల సమయంలో తనకు ఫోన్‌ వచ్చిందని, తన బిడ్డ ఆటో నుంచి పడిపోవడంతో అపస్మారక స్థితికి చేరినట్లు తెలిసిందని అన్నారు. పోలీసులు అమెను ఆసుపత్రికి చేర్చారని తెలిపారు. రేప్‌ జరగలేదని తన కుమార్తె తనతో స్వయంగా చెప్పిందని వెల్లడించారు.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)