సెల్యూట్‌తో భర్తకు కడసారి వీడ్కోలు..

Published on Mon, 11/24/2025 - 05:16

సిమ్లా: దుబాయ్‌లో శుక్రవారం ఎయిర్‌ షోలో తేజస్‌ యుద్ధ విమానం ప్రమాదానికి గురైన భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) వింగ్‌ కమాండర్‌ నమాంశ్‌ సియాల్‌(37) అంత్యక్రియలు ఆదివారం హిమాచల్‌ ప్రదేశ్‌లోని సొంతూళ్లో జరిగాయి. తమ ప్రియమైన ‘నమ్ము’కు నివాళులర్పించేందుకు అధికారులు, అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 

వింగ్‌ కమాండర్‌ నామాంశ్‌ సియాల్‌కు ఆయన భార్య, వింగ్‌ కమాండర్‌ అయిన అఫ్షాన్‌ సెల్యూట్‌తో ఘనంగా నివాళులర్పించారు. కన్నీరు చెమర్చిన కళ్లతో కూతురును పొదివి పట్టుకుని భర్తకు ఆమె తుది వీడ్కోలు పలికారు. పూర్తి సైనిక లాంఛనాలు, గన్‌ సెల్యూట్‌తో అంత్యక్రియలు జరిపారు. నమాంశ్‌ సియాల్‌ చితికి బంధువు నిశాంత్‌ నిప్పు పెట్టారు. భారత ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌ ఆయనకు పుష్పాంజలి సమర్పించాయి. నమాంశ్‌ సియాల్‌కు తల్లిదండ్రులతోపాటు భార్య, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు. ఆయన తండ్రి జగన్నాథ్‌ సియాల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అధికారిగా ఉన్నారు. 

అంతకుముందు, దుబాయ్‌ నుంచి తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఉన్న సూలూర్‌ ఎయిర్‌బేస్‌కు విమానంలో అధికారులు సియాల్‌ పార్థివ దేహాన్ని తీసుకువచ్చారు. అక్కడి నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌లో గగ్గాల్‌ ఎయిర్‌పోర్టుకు ఐఏఎఫ్‌ విమానంలో మృతదేహాన్ని తరలించారు. పలువురు రాష్ట్ర నేతలు, అధికారులు గగ్గల్‌ ఎయిర్‌పోర్టు నుంచి స్వగ్రామం పటియాల్కార్‌ గ్రామానికి ఆర్మీ ట్రక్కులో మృతదేహాన్ని తీసుకువచ్చారు. కాగా, విమానప్రమాదంలో అసువులు బాసిన వింగ్‌ కమాండర్‌ నమాంశ్‌కు సినీ ప్రముఖులు కమల్‌ హాసన్, సోనూ సూద్, అద్నాన్‌ సమీ నివాళులర్పించారు.
 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)