Breaking News

భర్తతో కలిసి ఉండకపోతే భరణం కోరవచ్చు: సుప్రీంకోర్టు

Published on Mon, 01/13/2025 - 04:38

న్యూఢిల్లీ: భర్త నుంచి విడాకులు తీసుకోకుండా విడిగా ఉంటున్న మహిళ అతడి నుంచి భరణం పొందడానికి అర్హురాలేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. భర్తతో కలిసి ఉండలేకపోవడానికి తగిన కారణం ఉంటే భరణం కోరవచ్చని వెల్లడించింది. జార్ఖండ్‌కు చెందిన యువతి, యువకుడికి 2014 మే 1వ తేదీన పెళ్లి జరిగిది. 2015 ఆగస్టులో వారు విడిపోయారు. అధికారికంగా విడాకులు తీసుకోలేదు. చివరకు ఈ వ్యవహారం ఫ్యామిలీ కోర్టుకు చేరింది. 

వారిద్దరూ కలిసి ఉండొచ్చని, వివాహ సంబంధం ఎప్పటిలాగే కొనసాగించవచ్చని సూచిస్తూ ఫ్యామిలీ కోర్టు 2022 మార్చి 23న డిక్రీ జారీ చేసింది. అయితే, భార్య ఈ డిక్రీకి కట్టుబడి ఉండలేదు. భర్త నుంచి తనకు భరణం ఇప్పించాలంటూ అదే కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఆమెకు నెలకు రూ.10 వేల చొప్పున ఇవ్వాలని భర్తను ఆదేశిస్తూ ఫ్యామిలీ కోర్టు ఆదేశాలిచ్చింది. ఆ దేశాలను భర్త జార్ఖండ్‌ హైకోర్టులో సవాలు చేశాడు. 

భార్య తన వద్దకు తిరిగి రాలేదు కాబట్టి భరణం చెల్లించే ప్రసక్తే లేదని పేర్కొన్నాడు. అతడి వాదనతో హైకోర్టు ఏకీభవించింది. భార్యకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చిచెబుతూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ భార్య సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. భర్తతో కలిసి ఉండకపోయినా భార్య భరణం పొందవచ్చని తేల్చిచెప్పింది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 125 ప్రకారం భర్త నుంచి భరణం పొందడం భార్య హక్కు అని గుర్తుచేసింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)