నిద్రలో ఉన్న భర్త చెవిలో విషం పోసిన భార్య..!

Published on Thu, 07/02/2026 - 14:03

తమిళనాడు:  భర్తను చనిపోతే రుణదాతల ఒత్తిళ్ల నుంచి బైటపడవచ్చని భావించిన ఓ మహిళ కట్టుకున్న వాడినే లేపేసేందుకు స్కెచ్‌ వేసింది. అతడి చెవిలో విషం పోసింది. వివరాలు.. తంజావూరు జిల్లా, తిరువిడైమరుదూర్‌ తాలూకాలోని పుళుదికుడికి చెందిన కూలీ రవిచంద్రన్‌ (54),  ఉమారాణి (48)ని 27 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరి  కుమారుడు విదేశాలలో పని చేస్తుండగా, కుమార్తెకు పెళ్లైంది. రవిచంద్రన్‌ కొత్తగా ఇంటి నిర్మాణం కోసం మీద పాలారి-డ్యామ్, ఇతర గ్రూపుల నుంచి రూ.10లక్షల రుణం పొందాడు. 

దీనిని చెల్లించలేకపోవడంతో తరచూ దంపతులు మధ్య గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో తన భర్త చనిపోతే రుణం తీర్చాల్సిన ఒత్తిడి ఉండదని భావించిన ఉమారాణి, తన తమ్ముడు జ్ఞానశేఖరన్‌ (35)తో కలిసి భర్తను చంపేందుకు స్కెచ్‌ వేసింది. మంగళవారం రాత్రి రవిచంద్రన్‌ నిద్రిస్తున్న సమయంలో అతడి చెవిలో వారిద్దరూ విషం పోశారు. మేల్కొన్న రవిచంద్రన్‌ వారి నుంచి తప్పించుకుని స్థానికుల సాయంతో కుంభకోణం ఆస్పత్రిలో చేరాడు.

అతని ఫిర్యాదు ఆధారంగా, తిరువిడైమరదూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి ఉమారాణి, జ్ఞానశేఖర్‌ను అరెస్టు చేశారు. ప్రాధమిక విచారణలో మూడు నెలల క్రితమే ఆ ఇద్దరూ టీ లో విషం కలిపి అతన్ని చంపడానికి ప్రయత్నించారని, ఆ ఘటన నుంచి తప్పించుకున్న రవిచంద్రన్, అప్పటి నుంచి ఇంట్లో ఏమీ తినకుండా జాగ్రత్త పడుతున్నాడని తేలింది. ఈ క్రమంలో చెవిలో విషం పోసినట్లు నిర్ధారౖణెంది. నిందితులిద్దరినీ కోర్టులో హాజరు పరిచిన అనంతరం రిమాండ్‌ నిమిత్తం తంజావూరు జైలుకు తరలించారు.   

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)