Breaking News

ఎనిమిదేళ్లకు గర్భం దాల్చిన భార్య.. షాకైన భర్త!

Published on Wed, 07/30/2025 - 13:50

దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ఏదో ఒక కారణంతో కట్టుకున్న భర్తను హతమార్చడం ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. అదే మాదిరిగా ప్రియునితో కలిసి భర్తను కడతేర్చిన భార్య, మరో ఇద్దరిని దావణగెరె జిల్లా చన్నగిరి పోలీసులు అరెస్టు చేశారు.  

దంపతులు వేర్వేరుగా మిస్సింగ్‌..  
జిల్లా ఎస్పీ ఉమాప్రశాంత్‌ కేసు వివరాలను వెల్లడించారు. లింగప్ప తల్లి యల్లమ్మ 2024 జనవరి 22న తన కుమారుడు ఇంటి నుంచి వెళ్లినవాడు కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 10 రోజుల తరువాత లింగప్ప భార్య లక్ష్మి మిస్సయిందని ఆమె తల్లి మాలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు కేసుల్లోనూ దర్యాప్తు చేపట్టారు. లింగప్ప,   లక్ష్మికి పెళ్లయి 8 ఏళ్లు గడిచినా పిల్లలు కలగలేదు. లక్ష్మి వక్కతోటలో పనికి వెళ్తూ తిప్పేశ్‌ నాయక్‌ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడి గర్భం దాల్చింది. 

ఇది తెలిసిన లింగప్ప కడుపులో ఉన్నది తన బిడ్డ కాదని ఆగ్రహంతో కడుపు మీద కొట్టడంతో అబార్షన్‌ అయ్యింది. దీంతో లక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. తరువాత తిప్పేనాయక్‌ను కలిసి భర్తను హతమార్చాలని కుట్ర చేసింది. ఇద్దరూ సంతోష్‌ అనే మరో వ్యక్తి సహకారంతో లింగప్పను హతమార్చి భద్రా కాలువలో పడేసి కేరళకు పరారయ్యారు. సుమారు ఏడాదిన్నర నుంచి అక్కడే సంసారం కొనసాగిస్తున్నారు. పోలీసులు జాడ పసిగట్టి అరెస్టు చేశారు.  

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)