Breaking News

ఈ సవతిపోరును భరించలేకపోతున్నా..!

Published on Sat, 01/03/2026 - 13:46

తమిళనాడు: సెంగం సమీపంలో గుడిసెలో గాఢ నిద్రలో ఉన్న రైతుతోపాటు ఆయన రెండో భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టిన సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే తిరువణ్ణామలై జిల్లా సెంగం సమీపంలోని పక్రిపాళ్యం గ్రామానికి చెందిన శక్తివేల్‌(51) వ్యవసాయంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. ఇతని భార్య తమిళరసి, ఇద్దరి మద్య మనస్పర్థల కారణంగా గత మూడు సంవత్సరాల క్రితం విడి పోయారు. దీంతో శక్తివేల్‌ తీర్థాండపట్టు గ్రామానికి చెందిన అమృదం(44)ను రెండవ వివాహం చేసుకొని జీవిస్తున్నారు. 

భార్యభర్తలు ఇద్దరూ కలిసి ఆ ప్రాంతంలో ఒక వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నారు. వ్యవసాయ భూమిలో గుడిసెను వేసుకొని వాటిలోనే జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో శక్తివేల్, అమృదం ఇద్దరూ గురువారం రాత్రి వ్యవసాయ భూమిలోని గుడిసె ఇంటిలో నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గుడిసె ఇంటికి ముందు పక్కన ఉన్న తలుపులు మూసి వేసి గుడిసెపై పెట్రోల్‌ను పోసి నిప్పు పెట్టారు. పెట్రోల్‌ పోయడంతో ఉన్నపళంగా మంటలు చెలరేగాయి.

 గాఢ నిద్రలో ఉన్న శక్తివేల్‌ ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయతి్నంచినప్పటికీ  తలుపులు మూసి వేయడంతో బయటకు వచ్చేందుకు కుదరలేదు. దీంతో మంటల్లో చిక్కుకొని ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం స్థానికులు గమనించగా గుడిసె మంటల్లో చిక్కుకొని దంపతులు ఇద్దరూ కాలి బూడిదగా మారి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. సెంగం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. గుడిసె ఇంటికి ఎవరు నిప్పు పెట్టారు, ఎందుకు పెట్టారు, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.    

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)