Breaking News

వితంతువుకు నిలువునా మోసం

Published on Fri, 08/22/2025 - 09:32

చిక్కబళ్లాపురం: అండగా ఉంటానని వితంతువును పెళ్లి చేసుకొని గర్భిణిని చేసిన వ్యక్తి మరో వివాహం చేసుకున్నాడు. న్యాయం చేయాలని వెళ్లిన మొదటి భార్యపై కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఈఘటన జిల్లా కేంద్రంలో జరిగింది.  చిక్కబళ్లాపురం నగరంలో నివాసముంటున్న కీర్తి భర్త 2022లో మృతి చెందాడు. ఈ దంపతులకు కుమార్తె ఉంది. కుటుంబ పోషణ కోసం ఆమె ఓ ప్రైవేటు కంపెనీలో పనులకు వెళ్లేది. అక్కడ అంబిగానహళ్లికి చెందిన సునీల్‌తో  పరిచయమైంది. 

అనంతరం ఇద్దరూ గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. రిజి్రస్టార్‌ కార్యాలయంలో వివాహాన్ని నమోదు చేయించారు. కొద్ది రోజులు వీరి కాపురం సవ్యంగా సాగింది. అనంతరం సునీల్‌ గొడవ పడుతుండగా పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. పోలీసులు మందలించడంతో కీర్తిని బాగా చూసుకుంటానని హామీ పత్రం రాసిచ్చాడు. ప్రస్తుతం కీర్తి ఎనిమిది నెలల గర్భిణి. అయితే సునీల్‌ మరో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కీర్తి  అంబిగానహళ్లిలోని సునీల్‌ ఇంటికి వెళ్లగా అతని తల్లిదండ్రులు దాడి చేశారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి కీర్తిని  ఆస్పత్రికి తరలించారు.        

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)