Breaking News

కూతురి వీడియోను ప్ర‌ధానికి ట్యాగ్ చేసిన శ‌త్రుఘ్న సిన్హా

Published on Fri, 07/17/2026 - 19:22

న్యూఢిల్లీ: త‌న కూతురు సోనాక్షి సిన్హా స‌రైన స‌మ‌యంలో స్పందించి త‌న‌ను త‌లెత్తుకునేలా చేసింద‌ని బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శ‌త్రుఘ్న సిన్హా పేర్కొన్నారు. విద్యార్థుల కోసం నిరాహారదీక్ష చేస్తున్న సోన‌మ్ వాంగ్‌చుక్‌కు మ‌ద్దతుగా ఆమె గ‌ళం విన్పించింద‌ని గుర్తు చేశారు. అంతేకాదు వాంగ్‌చుక్‌కు సంఘీభావంగా త‌న కుమార్తె చేసిన వీడియోను ప్ర‌ధాని మోదీకి, ఆయ‌న కార్యాల‌యానికి సోష‌ల్ మీడియాలో ట్యాగ్ చేశారాయ‌న‌. వాంగ్‌చుక్ ఆరోగ్యం బాగా క్షీణించింద‌ని, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వెంట‌నే జోక్యం చేసుకుని ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దాల‌ని కోరారు. వాంగ్‌చుక్ ప్రాణాల‌ను కాపాడాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.

''నీట్ యూజీ పరీక్షా పత్రం లీక్ వ్యవహారంలో యువతకు మ‌ద్ద‌తుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పర్యావరణ కార్యకర్త, విద్యా సంస్కర్త అయిన సోన‌మ్ వాంగ్‌చుక్ శాంతియుతంగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఒక న్యాయమైన డిమాండ్‌తో ఆయన దాదాపు మూడు వారాలుగా ఆమరణ దీక్షలో ఉన్నారు. దీనివల్ల ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. గత కొన్ని రోజులుగా, దేశ విదేశాలకు చెందిన అనేక రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రముఖులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, కార్యకర్తలు ఆయనకు మద్దతుగా నిలిచారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అత్యంత క్లిష్ట దశలో ఉన్నందున, ప్రభుత్వం, సంబంధిత అధికారులు, గౌరవనీయులైన ప్రధాని న‌రేంద్ర మోదీ తక్షణమే జోక్యం చేసుకోవాలి. ఆయన డిమాండ్లను నెరవేర్చి, ఈ నిరసనను వీలైనంత త్వరగా ముగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. వాంగ్‌చుక్‌ను కాపాడండి! సరైన సమయంలో ధైర్యంగా, బహిరంగంగా స్పందించి, నా కుటుంబానికి గర్వకారణమైన నా ప్రియమైన కుమార్తె సోనాక్షి సిన్హా ఈ రోజు నన్ను మరింత గర్వపడేలా చేసింది. మీ సమాచారం కోసం ఈ విషయంపై ఆమె అభిప్రాయాలను కూడా ఇక్కడ పంచుకుంటున్నాను! వాంగ్‌చుక్‌ను కాపాడండి! జై హింద్!'' అని ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.

చ‌ద‌వండి: వాంగ్‌చుక్‌ చ‌నిపోతే ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తారు?

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)