Breaking News

నితీశ్ కుమార్ నియోజ‌క‌వ‌ర్గం!

Published on Fri, 11/14/2025 - 14:45

బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎన్డీఏ కూట‌మి విజ‌య కేత‌నం ఎగుర‌వేసింది. డ‌బుల్ సెంచ‌రీతో మ‌హాగ‌ఠ్‌బంధ‌న్‌పై విజ‌య దుందుభి మోగించింది. ఎన్డీఏ ధాటికి ప్ర‌తిప‌క్ష కూటమి కకావిక‌లం అయింది. క‌నీసం హాఫ్ సెంచ‌రీ కూడా కొట్ట‌లేక కుదేల‌యింది. కొత్త‌గా వ‌చ్చిన జ‌న సురాజ్ పార్టీకి ఖాతా కూడా తెర‌లేక‌పోయింది. ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్‌పై బిహార్ ప్ర‌జ‌లు మ‌రోసారి విశ్వాసం ఉంచారు. అఖండ మెజారిటీతో ఆయ‌న‌కు మ‌ద్ద‌తు తెలిపారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలే శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లోనూ రావ‌డంతో నితీశ్ కుమార్ ప్రాభ‌వం శిఖ‌రాల‌కు చేరింది.

బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర‌మైన టాపిక్ గూగుల్‌లో ట్రెండ్ అవుతోంది. అదేంటంటే.. నితీశ్ కుమార్ నియోజ‌క‌వ‌ర్గం (Nitish kumar Constituency). ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం గురించి గూగుల్‌లో జ‌నం విప‌రీతంగా వెతికేశారు. దీనికి సంబంధించిన సెర్చ్ వాల్యూమ్ 100K వ‌ర‌కు ఉంద‌ని గూగుల్ ట్రెండ్స్ ద్వారా వెల్ల‌డైంది. ఆస‌క్తిక‌ర విష‌యం ఏమిటంటే నితీశ్ కుమార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు. ఆయ‌న శాస‌నమండ‌లి స‌భ్యుడిగా ఉన్నారు. చాలా ఏళ్లుగా ఆయ‌న ఎమ్మెల్సీగా కొన‌సాగుతున్నారు.

నితీశ్ కుమార్ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసి 40 ఏళ్లు అవుతోంది. 1985లో హర్నాట్ నియోజకవర్గం నుంచి ఆయ‌న ఎమ్మెల్యేగా గెలిచారు. త‌ర్వాత మ‌ళ్లీ ఆయ‌న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు. 1989- 2004 మ‌ధ్య కాలంలో జాతీయ రాజకీయాల్లో కీల‌క పాత్ర పోషించారు. ప‌లుమార్లు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో గెలిచి కేంద్రంలో మంత్రి ప‌ద‌వులు కూడా నిర్వ‌హించారు. 1990లో వీపీ సింగ్ ప్ర‌భుత్వంలో వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా ప‌నిచేశారు. 1998 నుంచి 2004 వ‌ర‌కు అట‌ల్ బిహారి వాజ‌పేయి కేబినెట్‌లో ప‌లు కీల‌క‌ శాఖ‌లు నిర్వ‌హించారు. 

చ‌ద‌వండి: తేజ‌స్వీకి చెమ‌ట‌లు ప‌ట్టించాడు.. ఎవ‌రీ స‌తీశ్‌?

వీరి గురించి తెగ వెతికారు
బిహార్ ఎన్నిక‌ల సంబంధించి ప‌లు అంశాలు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచాయి. నితీశ్ కుమార్,  తేజ‌స్వీ యాద‌వ్, తేజ్ ప్ర‌తాప్ యాద‌వ్ నియోజ‌కవ‌ర్గాల గురించి ఎక్క‌వగా నెటిజ‌నులు శోధించారు. తొలిసారి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన భోజ్‌పురి సూప‌ర్‌స్టార్‌, గాయ‌కుడు ఖేస‌రీలాల్ యాద‌వ్ (Khesarilal Yadav) ఎన్నికల ఫ‌లితం గురించి జ‌నాలు ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. చ‌ప్రా నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆర్జేడీ అభ్య‌ర్థిగా ఆయ‌న‌ పోటీ చేశారు. ఇక్క‌డ బీజేపీ అభ్య‌ర్థి చోటీ కుమారి ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. అలీనగర్ స్థానం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన ప్ర‌ఖ్యాత జాన‌ప‌ద గాయ‌ని మైథిలి ఠాకూర్ (Maithili Thakur) ఎన్నిక‌ల ఫ‌లితం గురించి కూడా ఆన్‌లైన్‌లో తెగ వెతికారు.

బిహార్ ఎన్నిక‌ల ట్రెండింగ్ టాపిక్స్‌
1. నితీశ్ కుమార్ నియోజ‌కవ‌ర్గం
2. తేజ‌స్వీ యాద‌వ్ నియోజ‌కవ‌ర్గం
3. తేజ్ ప్ర‌తాప్ యాద‌వ్ నియోజ‌కవ‌ర్గం
4. ఖేస‌రీలాల్‌
5. చ‌ప్రా విధాన‌స‌భ ఫ‌లితం 2025
6. మైథిలా ఠాకూర్ ఎన్నిక‌ల ఫ‌లితం
7. ప‌వ‌న్ సింగ్‌
8. అనంత్ సింగ్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)