Breaking News

ప్రయాణికులకు చుక్కలు చూపిన ఎయిరిండియా!

Published on Wed, 12/03/2025 - 06:40

ఎయిరిండియా విమానయాన సంస్థ తన ప్రయాణికులకు చుక్కలు చూపించింది. పలు ఎయిర్‌పోర్టులలో పడిగాపులతో ప్రయాణికులు తీవ్ర​ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఈ పరిస్థితికి వివరణ ఇస్తూ ఎయిర్‌లైన్స్‌ తర్వాత ఒక ప్రకటనలో స్పష్టత ఇచ్చింది. 

మంగళవారం సాయంత్రం తర్వాత పలు ఎయిర్‌పోర్టులలో ఎయిరిండియా ప్యాసింజర్ల చెక్‌ ఇన్‌ను అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో క్యూ లైన్లలో ప్రయాణికులు చాలాసేపు ఎదురు చూశారు. సాంకేతిక సమస్య కారణంగానే ఇది చోటు చేసుకుందని ఆ తర్వాత ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది. థర్డ్‌ పార్టీ సిస్టమ్‌లో సమస్య కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని.. ఆ సమస్యను పరిష్కరించామని.. ఇప్పుడంతా సర్వసాధారణ పరిస్థితి నెలకొందని.. రాకపోకలు షెడ్యూల్‌ ప్రకారమే కొనసాగుతున్నాయని పేర్కొంటూ ఎక్స్‌ ఖాతాలో ఓ ట్వీట్‌ చేసింది.   

ఫ్లైట్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ ఫ్లైట్‌రాడార్‌24 ప్రకారం.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని విమానాలు ఆలస్యం కాగా.. మరికొన్ని పూర్తిగా రద్దయ్యాయి. ఇదిలా ఉంటే.. కిందటి నెలలోనూ ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడిన సంగతి గుర్తుండే ఉంటుంది. 

ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థలో టెక్నికల్‌ ఇష్యూ తలెత్తి సుమారు 800 విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దానికి కొన్ని రోజులముందు జీపీఎస్‌ స్పూఫింగ్ (GPS spoofing) జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ స్పూఫింగ్ నిజమేనని, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌ (జీఎన్‌ఎస్‌ఎస్‌)  మార్చేందుకు యత్నాలు జరిగినట్టు కేంద్రం ధ్రువీకరించింది. పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా.. సోమవారం రాజ్యసభలో పౌరవిమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు ఈ మేరకు ప్రకటన చేశారు.

నేవిగేషన్‌ వ్యవస్థను ప్రభావితం చేసి నకిలీ జీపీఎస్‌ ద్వారా విమానాలను దారి మళ్లించే ప్రక్రియను జీపీఎస్‌ సిగ్నల్‌ స్పూఫింగ్‌ అంటారు. నిజమైన శాటిలైట్‌ సిగ్నల్స్‌ను అడ్డుకొని ఆ స్థానంలో నకిలీ సంకేతాలను పంపి జీపీఎస్‌ రిసీవర్‌ను తప్పుదోవ పట్టిస్తాయి. ఫలితంగా.. ప్రస్తుతమున్న ప్రదేశం, సమయాన్ని తప్పుగా చూపించేలా చేస్తాయి. పౌర విమానాలే లక్ష్యంగా అంతర్జాతీయ రూట్‌లలో ఈ తరహాలో జరిగిన సైబర్ దాడులు తరచూ వెలుగుచూస్తున్నాయి. దేశంలో నవంబర్‌ 2023- ఫిబ్రవరి 2025 మధ్యకాలంలో 465 జీపీఎస్‌ స్పూఫింగ్‌ ఘటనలు నమోదైనట్లు అంచనా.

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు