ఎవరీ తహ్సీన్ పూనావాలా? అభిజీత్‌ దీప్కే కన్నా ఫేమస్‌ అవుతాడా?

Published on Sat, 08/01/2026 - 19:43

ఇప్పటికే కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) అధ్యక్షుడు అభిజీత్‌ దీప్కే నీట్‌ అవకతవకలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి ఫేమస్‌ అయ్యారు. ఇప్పుడు చాలా మంది ఈ20 పెట్రోల్‌పై గళం విప్పుతున్నారు. ఈ20 ఇథనాల్ మిశ్రమ ఇంధన విధానానికి వ్యతిరేకంగా నిరసన చేపడతానని తహ్సీన్ పూనావాలా అనే వ్యక్తి పదే పదే వార్తల్లో నిలుస్తున్నారు. నిరసన చేపడతానని ప్రకటించడంతో ఢిల్లీ పోలీసులు తనను గృహ నిర్బంధంలో ఉంచారని తెలుపుతూ వీడియోలు వీడియోలు పోస్ట్‌ చేశారు. తహ్సీన్‌ పూనావాలా ఓ వెంచర్ క్యాపిటలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు, కన్సల్టెంట్.

పూనావాలా నిరసన కూడా దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న వేళ ఆయన ఎవరన్న ఆసక్తి అందరిలోనూ రేగుతోంది. తహ్సీన్ పూనావాలా తన ప్రాథమిక విద్యను మహారాష్ట్రలోని పూణేలో పూర్తి చేశారు. అక్కడే ఆయన పెరిగారు.

ప్రజలకు అందుబాటులో ఉన్న జీవిత విశేషాల సమాచారం ప్రకారం.. తహ్సీన్ పూనావాలా తన విద్యను మహారాష్ట్రలోని పూణేలో పూర్తి చేశారు. అనంతరం ఎంఐటీ పూణేలో (ప్రస్తుతం ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్సిటీ) ఉన్నత విద్య అభ్యసించారు. అక్కడ న్యాయశాస్త్రం, పాలిటిక్స్‌ చదివారు.

తహ్సీన్ పూనావాలా తన వృత్తి జీవితాన్ని పారిశ్రామికవేత్తగా, వెంచర్ క్యాపిటలిస్ట్‌గా ప్రారంభించారు. అనంతరం భారతదేశంలో గుర్తింపు పొందిన రాజకీయ వ్యాఖ్యాతల్లో ఒకరిగా ఎదిగారు. వార్తాపత్రికలు, డిజిటల్ ప్రచురణల్లో అభిప్రాయ వ్యాసాలు కూడా రాశారు. టెడ్ఎక్స్ కార్యక్రమాలు సహా పలు ప్రజా వేదికల్లో ప్రసంగించారు.

టెలివిజన్‌కు మాత్రమే పరిమితం కాకుండా, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, సామాజిక ఉద్యమాల్లోనూ పాల్గొన్నారు. పాలన, పారదర్శకత వంటి అంశాలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. రాజకీయ వ్యాఖ్యానంతో పాటు వినోద రంగంలోనూ పూనావాలా కనిపించారు. 2019లో బిగ్ బాస్ 13లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ప్రవేశించారు. 2022లో కంగనా రనౌత్ నిర్వహించిన లాక్ అప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో రాజకీయ వ్యాఖ్యానానికి మించి ఆయనకు మరింత ప్రజాదరణ లభించింది.

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)