Breaking News

ఈయన క్లబ్‌లోనే మంటలు.. షాకిస్తున్న ఓనర్‌ బ్యాక్‌గ్రౌండ్‌

Published on Sun, 12/07/2025 - 16:28

గోవా: గోవాలోని అర్పోరాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని 25 మంది ప్రాణాలు కోల్పోవడం దేశంలోని అందరినీ ఆవేదనకు గురిచేసింది. ఈ నేపధ్యంలో ప్రమాదం జరిగిన ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌ ఎవరిదనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ నైట్‌క్లబ్‌ను ఒక గోల్డ్‌ మెడలిస్ట్‌ స్థాపించాడని తెలియగానే పలువురు ఆశ్చర్యపోతున్నారు. సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం నుండి బీటెక్‌లో బంగారు పతకం అందుకున్న సౌరభ్ లూత్రానే ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌ యజమాని. చదువు పూర్తయిన తర్వాత లూత్రా అంతర్జాతీయ క్లయింట్‌ల కోసం బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా పనిచేశారు. తరువాత తన కెరీర్‌ను రెస్టారెంట్, నైట్‌లైఫ్ వ్యాపారం వైపు మళ్లించాలని నిర్ణయించుకున్నారు. 2016లో ఆహారపానీయాల (ఎఫ్‌ అండ్‌ బీ) పరిశ్రమలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అదే ఏడాది న్యూఢిల్లీలో  ‘రోమియో లేన్’ అనే బ్రాండ్‌ను స్థాపించారు.

ఈ బ్రాండ్ వేగంగా విస్తరించింది. అంతర్జాతీయంగా కూడా విస్తరించాలని లూత్రా ప్రణాళికలు వేశారు. అతని నైట్‌క్లబ్ వెబ్‌సైట్ ప్రకారం రోమియో లేన్ ప్రస్తుతం భారతదేశంతో సహా నాలుగు దేశాలలోని 22 నగరాల్లో ఔట్‌లెట్‌లను కలిగి ఉంది. ఈ విస్తరణ అతని వ్యాపార దార్శనికతకు నిదర్శనంగా నిలిచింది. అతని బ్రాండ్‌కు లభించిన పలు అవార్డులు.. ఫోర్బ్స్ ఇండియాలో ఈ బ్రాండ్‌ ఫీచర్ కావడం మొదలైనవి అతని వ్యాపార విజయాలకు అద్దం పడుతున్నాయి.

లూత్రాకు చెందిన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం అతను రోమియో లేన్‌కు మాత్రమే కాకుండా ‘బిర్చ్’, ‘మామాస్ బుయోయి’ తదితర సంస్థలకు కూడా ఛైర్మన్‌గా  ఉన్నారు. ఇది ఆయన నైట్‌లైఫ్, హాస్పిటాలిటీ రంగంలో ఎంతటి విజయం సాధించారో తెలియజేస్తుంది. అయితే గోవాలోని అతని క్లబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం  అతని వ్యాపార కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపనున్నది. ఈ నైట్‌క్లబ్‌లో సిలిండర్ పేలుడు వల్ల మంటలు చెలరేగి, 25 మంది  ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్యాన్స్ ఫ్లోర్‌లో 100 మందికి పైగా జనం ఉన్నట్లు సెక్యూరిటీ గార్డు తెలిపారు. ప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తులో.. క్లబ్ యాజమాన్యం అగ్నిమాపక భద్రతా నియమాలను విస్మరించిందని వెల్లడయ్యింది. మృతులలో ఎక్కువ మంది వంటగది సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. పోలీసులు నైట్‌క్లబ్ మేనేజర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. 

ఇది కూడా చదవండి: ‘మా ఆయన సీఎం కావాలి’: సిద్ధూ భార్య

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)