భారత్‌లో నాలుగేళ్ల చిన్నారికి బర్డ్‌ఫ్లూ

Published on Wed, 06/12/2024 - 15:44

న్యూఢిల్లీ : భారత్‌లో బర్డ్‌ ఫ్లూ కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)కీలక ప్రకటన చేసింది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన నాలుగేళ్ల బాలుడికి బర్డ్‌ ఫ్లూ సోకినట్లు నిర్ధారించింది. బాలుడిలో ​h9n2బర్డ్‌ ఫ్లూ వైరస్‌ వ్యాధి లక్షణాలను గుర్తించినట్లు వెల్లడించింది.  

బర్డ్‌ ఫ్లూ వైరస్‌ లక్షణాలు వెలుగులోకి రావడంతో బాలుడిని అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చేరిన తర్వాత బాలుడికి శ్వాసకోస సంబంధిత సమస్యలు తలెత్తాయని, ప్రస్తుతం ఐసీయూ వార్డ్‌లో ట్రీట్మెంట్‌ అందిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.

భారత్‌లో ఇది రెండో కేసు
భారత్‌లో H9N2 బర్డ్‌ఫ్లూను మనుషుల్లో గుర్తించడం ఇది రెండోసారి. 2019లో ఒకరు దీని బారినపడ్డారని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.  

రెండున్నరేళ్ల చిన్నారిలో 
భారత్‌లో పర్యటించిన జూన్‌7న ఆస్ట్రేలియాలో రెండున్నరేళ్ల చిన్నారిలో h5n2 బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపించాయి. అంతకుముందే ఆ చిన్నారి భారత్‌ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చినట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.  

బర్డ్‌ఫ్లూ లక్షణాలు 
డబ్ల్యూహెచ్‌ఓ మేరకు..బర్డ్‌ఫ్లూ వైరస్‌ సోకితే వ్యాధిగ్రస్తుల్లో కండ్లకలక, కడుపులో అసౌకర్యం, పొత్తికడుపు తిమ్మిరి, వికారం, వాంతులు,  గుండెల్లో మంట,మెదడు వాపు,అనాక్సిక్ ఎన్సెఫలోపతి : కార్డియాక్ అరెస్ట్ లేదా మెదడుకు ఆక్సిజన్/ప్రసరణ కోల్పోవడంతో పాటు ఇతర లక్షణాలు ఉత్పన్నమై ప్రాణంతంగా మారుతుందని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది.  

బర్డ్‌ఫ్లూ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు 
బర్డ్‌ఫ్లూ సోకకుండా ఉండేందుకు ముందుగా మూగజీవాలకు దూరంగా ఉండాలి. మూగజీవాల ద్వారా వైరస్‌లు ప్రభావితమయ్యే ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిదని తెలిపింది.ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మూగజీవాలు ఉన్న ప్రాంతాలను సందర్శించే ముందు, తర్వాత తప్పని సరిగా సబ్బులతో చేతుల్ని శుభ్రం చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌ఓ సూచిస్తోంది. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)