Breaking News

ఏ రాష్ట్రంలో ఎక్కువ పనిగంటలు? తెలంగాణ సంగతేంటి?

Published on Thu, 11/02/2023 - 08:06

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పని చేయాలని చెప్పినప్పటి నుండి, జనం ఈ విషయంలో రెండు వర్గాలుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. కార్మికవర్గం దీనిని సరైనదిగా భావించడం లేదు. అయితే యాజమాన్యం దీనిని సమర్థించుకునేందుకు భిన్నమైన వాదనలు వినిపిస్తోంది. అయితే ఈ రోజు మనం.. దేశంలోని ఏ రాష్ట్రంలోని ప్రజలు  అధిక గంటలు పని చేస్తున్నారు? అత్యధిక వేతనం పొందుతున్నవారెవరు? అనే విషయాలను తెలుసుకుందాం. 

మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ఉత్తరాఖండ్ ప్రజలు గరిష్టంగా 9.6 గంటలు పని చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. తెలంగాణలో సగటు ఉద్యోగి రోజుకు 9.2 గంటలు పనిచేస్తున్నాడు. గుజరాత్, మహారాష్ట్ర మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రతి ఉద్యోగి రోజూ సగటున 9 గంటలు పని చేస్తున్నాడు. అయితే తక్కువ పనిగంటల విషయానికొస్తే దేశంలోని మణిపూర్ మొదటి స్థానంలో ఉంది. సగటున ఇక్కడి ప్రజలు ప్రతిరోజూ 6 గంటలు పని చేస్తారు.

ఏ రాష్ట్రంలోని ప్రజలు ఎన్ని గంటలు పనిచేస్తున్నారో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రజలు అత్యధిక జీతం పొందుతున్నారో తెలుసుకుందాం. 2022వ సంవత్సరంలో ఆర్‌బీఐ దీనికి సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం కేరళ ప్రజలు దేశంలోనే అత్యధిక జీతం పొందుతున్నారు. ఇక్కడ తలసరి వార్షిక ఆదాయం రూ.1,94,767. వేతనాల గురించి చెప్పాలంటే ఇక్కడి కార్మికులకు రోజువారీ వేతనం రూ.838. కాగా హర్యానా, పంజాబ్‌లు ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాయి. 
ఇది కూడా చదవండి: యురేనస్‌ మీద ఐదు సెకెన్లు ఉండగలిగితే?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)